Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

సకలనీతిసమ్మతము

ప్రథమాశ్వాసము

ఉ.

శ్రీమహిళాకటాక్షతులసీదళకౌస్తుభరత్నకాంతు లు
ద్ధామగతి న్వెలుంగ విదితం బగు శక్రధనుస్సమేతమే
ఘామలభాతిఁ బొల్చు సుగుణాఢ్యుఁడు రామగిరీంద్రకేశవ
స్వామి త్రి[లోకనాథుఁడు] ధ్రువంబుగ మత్కృతినాథుఁ డయ్యెడున్.

1


వ.

అని యాశీర్వచనపూర్వకంబుగా నప్పరమేశ్వరుచరణారవిందంబులు
డెందంబునఁ గుదురుపఱచి నమస్కరించి.

2


క.

సరసకవితావిలాసుఁడ
గురుభారద్వాజరమ్యగోత్రాబ్ధిసుధా
కిరణాయ్యలార్యతనయుఁడ
హరిదాసుఁడ మడికి సింగయాఖ్యుఁడ ధాత్రిన్.

3


వ.

సకలవిద్వజ్జనానుగ్రహంబున నొక్కప్రబంధంబు విరచింపం గోరి మనంబున
నిట్లని విత్కరించితి.

4


చ.

కరిహయశిక్షలందు నృపకార్యములందును సంధియానసం
గరములయందు వర్తకముఖంబునఁ గర్షకలీల మోక్షత
త్పరుఁ డగుచోట నీతి యనుదర్పణముం బరికించి చూడ కే
వెరవునఁ గార్యనిశ్చయవివేకము దోచునె బ్రహ్మకేనియున్.

5


క.

నీతి యెఱింగినమర్త్యుఁ డ
రాతుల భంజింపనోపు రాజుచేతన్
ఖ్యాతియు లాభముఁ బొందు స
మాతతముగ ముక్తికాతఁ డధికారి యగున్.

6


వ.

అట్లు గావున సకలశాస్త్రంబులందును నయశాస్త్రంబు ముఖ్యం బని తలంచి
చెప్పం బూనితి. నారద వసిష్ఠ పరాశర బాదరాయణ భృగ్వాంగిరస గురు శుక్ర