పుట:Sakalaneetisammatamu.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

1. పరిచయము

ప్రాచీనాంధ్రకవి మడికి సింగన రచించిన 'సకల నీతిసమ్మతము' అను నీ గ్రంథము క్రీ. శ. 1923లో శ్రీమానవల్లి రామకృష్ణకవి మహోదయులచే విస్మృతకవుల కృతులలో పదవదిగా ప్రకటితమైనది. కవిగారా సంవత్సరముననే దీనిని ముద్రించినను, వారిప్పటికరువదేండ్ల క్రిందటనే. ఈ గ్రంథము నెఱుగుదురు. క్రీ. శ. 1910లో వారు ప్రకటించిన 'ప్రబంధ మణి భూషణము' పీఠికలో నీ గ్రంథమునుగూర్చి యిట్లు వ్రాసియున్నారు.

"ఇట్టి సంచితకృతులు సంస్కృతమున విస్తారముగా గలవు. ఆంధ్ర భాషలో నాకు లభించినంతవట్టు పరికింప నట్టికృతికర్తల మడికి సింగనయే ప్రథముఁడు, అతఁడు ప్రాచీన పంచతంత్రి, ప్రాచీన కామందకము, ముద్రా మాత్యము. నీతి భూషణము, బదైననీతి, కుమారసంభవము, భారతము, మనుమంచిభట్టు నశ్వశాస్త్రము మొదలగు గ్రంథములలోని రాజనీతిపద్యముల సన్నియు నేఱి సకలనీతిసమ్మతమను గ్రంథమును గూర్చేను” (పుట 1).

కవిగారీ సకలనీతిసమ్మతమును ప్రకటించుటయేగాక, యెనిమిది పుటలలో విశేషవిషయవిలసితమగు నొక యుపోద్ఘాతము వ్రాసియున్నారు. దాని మూలమున _ మన ప్రాచీనాంధ్రవాఙ్ఞ్మయ చరిత్రలో నెన్ని కావ్యములు నష్టమైనవో తెలియుటయేగాక, తెలుగు సాహిత్యమున నీ నాటికి పరిశీలనలేని, శాస్త్రవాఙ్ఞ్మయమును గూర్చిన నూతనవిశేషములు తెలియుచున్నవి. ఇది చాల విలువగల గ్రంథమైనను, నీ నలభై ఏడేండ్లనుండి దీనిని కూలంకషముగా గౌకపోయిన- అధఏ ఆలవోకగానైన - విమర్శకులు పరిశీలింపలేదు.

1. వనపర్తి బ్రహ్మవిద్యావిలాస ముద్రాక్షరశాలలో ముద్రితమైనది.