Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. సకలనీతి సమ్మతమునుండి
ఇతరకవు లుదాహరించిన పద్యములు.

(1) 22 ఉ. ఆకులవృత్తి రాఘవు శరాగ్రమునందుఁ దృణాగ్నలగ్న నీ

రాకృతి వార్థి యింకుట దశాస్యునిఁ జంపుట మిథ్య గాదె వా
ల్మీకులు సెప్పకున్న కృతిలేని నరేశ్వరు వర్తనంబు ర

త్నాకరవేష్టితావని వినంబడ దాతఁడు మేరు వెత్తినన్.

- నీతి భూషణము

ఈ పద్యమును కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసంగ్రహమున భైరవుని శ్రీరంగమాహాత్మ్యములోనిదిగా నుదాహరించినాడు. (చూ. పుట49) కాని యిది నీతిభూషణములోనిదని యిపుడు స్పష్టమైనది.

(2) 150 శా. ఉత్సాహప్రభుమంత్రశక్తుల నజేయుండై పరిక్షీణసం

ధత్సావ్యగ్రుఁడు గాక విగ్రహముచో దేశంబు గాలంబు సం
పత్సామగ్ర్యముఁ జూచి కార్యము దెసన్ బ్రారంభియై భూప్రజన్

వాత్సుల్యార్ద్రమనస్కుఁ డైన పతి శశ్వచ్ఛ్రీసమేతుం డగున్.

- నీతి భూషణము

ఈ పద్యము ప్రబంధరత్నావళిలో తిక్కన విజయసేనములోనిదిగా నుదాహరింపబడినది (ప. 154) . ఇందు రెండుచోట్ల పాఠభేదములుగలవు—

స. ప. పరిక్షీణసంధిత్సా....శక్యముదెసన్
ప్ర. ర. పరీక్షించినన్ దిత్సా..... కార్యము దెసన్.

(3) 339 శా. నానాశాస్త్రవిచక్షణుండు నయనానందాంగుఁడున్ సత్కుల

స్థానశ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్సిద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడగు నిశ్చింతుండు నై యుండినన్

వానిన్ మానుగ రాజదూత యని తల్పన్ వచ్చు నుర్వీస్థలిన్.

—పంచతంత్రి