పుట:Sakalaneetisammatamu.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉ. ఒక్కటఁ గూటయుద్ధమున నుక్కఱ శత్రు వధించినన్ జయం
బెక్కుడు గల్గి పాప మొకయించుక పొందదు నిశ్చయంబు పే
రుక్కున ద్రోణసుతుఁ డుఱ కొక్కయెడ న్నడురేయి నిద్రమైఁ
జొక్కిన పాండునందనులఁ జూచి వధింపఁడె సౌప్తికక్రియన్. 956

కామందకము

కార్యత్వరితరీతులు

క. ఆద్యావస్థనె నృపతులు
ఛేద్యులఁ జెఱుచునది తడవు సేయుటయు నఖ
చ్ఛేద్యము ముదిరి కుఠార
చ్ఛేద్యం బగు నండ్రు నీతిసిద్ధాంతవిదుల్. 957

బద్దెననీతిక. ధీయుతులమాట లప్పుడ
సేయక మోహమునఁ దడవు సేయునతఁడు దా
నాయెడ దా శేరకుగతి
వేయును జెప్పంగ నేల వేగమె పొలియున్ 958

పంచతంత్రిక. డెందమునఁ దెలిసియును జే
యం దెంపరి గాకయుండు నాతని తలపో
తం దీరునె యవకార్యము
మం దెఱిఁగినమాత్ర తెవులు మానుట గలదే 959

నీతిభూషణముక. పదను దొరకొనుడుఁ జెచ్చెర
వదలక వెదబెట్టు హలికవర్గముకరణిన్
బదను దొరకొనుడుఁ జెచ్చెర
వదలక కార్యంబు దీర్పవలయుం బతికిన్. 960

బద్దెననీతిక. స్వపరహితకార్యకర్మము
నిపుణుండై వేగ చేయ నేరకయున్నన్
విపరీతస్థితికాలము
కుపితంబై తత్ఫలంబు కొనిచనుఁ బిదపన్. 961

చాటువు

అధికారముల సయోధ్యప్రకారము

ఉ. గండతలంబులం బెలుచఁ గ్రమ్ములసన్మదవారికై యశుల్
పిం డరుదెంచి యంటి కడుఁ బ్రేమబలాయతమూర్తు లయ్యు వే
దండవిభు ల్సహించి తమదర్పము సూపక చూచినట్ల హీ
నుం డగువాని కల్గునె ఘనుండు దలంప ధరాతలంబునన్. 962