పుట:Sakalaneetisammatamu.pdf/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఇరుదెఱఁగు యానంబుల
నరయంగాఁ బ్రాణరక్షణార్థం బొకఁడున్
దుర మొనరించుట నొకఁడును
భరపడు నివి యుభయయానభంగులు జగతిన్. 818

నీతిసారముసీ. కరిరథభటఘోటకవ్రజారోహణ
కుశలుండు ధర్మార్థకుం డరోగి
సంచారదూతప్రచారజ్ఞుఁ డల్ప
శరీరుండు రాత్రిప్రచారనిపుణుఁ
డరిసైన్యభంజనుఁ డాత్మసేనాధీన
పరనయస్తంభనోపాయదక్షుఁ
డధ్వానశీతాతపాత్యుగ్రతరవృష్టి
గురుభయగ్లాన్యాదివిరహితుండు
గీ. సమరసాధ్యనిశ్చయుఁడు మల్లయుద్ధ
నానాయుధానేకలయుద్ధజయుఁడు
నైన దళవాయి నేలిన యతఁడు రాజు
ఘనకళాభోజ యబ్బయకందరాజ. 819

చాటువుక. కులవిద్యాచారంబులు
బలగము కార్యంబు హితవు బ్రభుతయుఁ జలముం
గలిగి శుచి యైనవానిని
దళవాయిం జేయవలయుఁ దంత్రానుమతిన్. 820

నీతిసారముగీ. అట్టి సేనాధిపతి సదోద్యమముతోడ
సేనఁ బ్రోవంగవలయు దివానిశంబు
అట్టి వనదుర్గభయముల నడపవలయు
సైన్యసన్నాహవిభవంబు చాల నొప్ప. 821

కామందకముక. పరిగొని శీఘ్ర మరాతులఁ
బరిమార్పఁగ నొదవుఁగాని పట్టులఁ గడు ని
ర్భరముగఁ దొలంగి యప్పుడ
యరివర్గము ముట్టి చంప హయములు వలయున్. 822

పురుషార్థసారముక. అశ్వములు గలుగు రాజుకు
విశ్వంభర చేతనుండు విమతుల మనుభూ
మీశ్వరు లెవ్వరు వెఱతురు
శశ్వద్ధాటీవిహారసామర్థ్యమునన్. 823

నీతిసారము