పుట:Sakalaneetisammatamu.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞప్తి

‘సకలనీతిసమ్మతము’ మడికి సింగనచే కూర్పబడిన సంకలన గ్రంథము. ఆంధ్రభాషలో ఇట్టి సంకలనగ్రంథములకు శ్రీకారము చుట్టినవాడు సింగనామాత్యుడు. ఇందు ఆయన తనకు పూర్వులైన ఆంధ్రకవుల గ్రంథములనుండి రాజనీతీపద్యముల చేర్చి కూర్చినాడు. ప్రాచీనాంధ్రవాఙ్మయచరిత్రకిది చాల ముఖ్యగ్రంథము.

ఇట్టి ఉత్తమగ్రంథమును సుప్రసిద్ధ విద్వాంసులు కీ.శే. మానవల్లి రామకృష్ణ కవిగారు. 1923 లో సంపాదించి ప్రకటించిరి. ఆ తరువాత ఎవరును దీనిని పరిశీలింపలేదు. ఈ గ్రంథముసు మరల పరిశీలించి విశేషకృషిచేసి విపులపీఠికతో ముద్రణకు సిద్ధము చేసి యిచ్చిన పండితులు శ్రీ నిడుదవోలు వేంకటరావు గారికిని, డా. పి. యస్. ఆర్. అప్పారావు గారికిని ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమి పక్షమున కృతజ్ఞతలు తెలుపుకొనుచు, ఈ గ్రంథము ఆంధ్రావళి మోదము బడయగలదని ఆశించుచున్నాను.

దేవులపల్లి రామానుజరావు, కార్యదర్శి