పుట:Sakalaneetisammatamu.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. కామభవవ్యసనం బ
...............................................
.............................
ద్దామక్రోధోద్ధితోన్మదవ్యసనములన్. 657

పురుషార్థసారముక. వనితాశక్తియుఁ దానం
బును జూదము వేఁట యర్థము[న దూషణ మొ
ప్పనిదండమ్ముని వాక్కున
ఘనపరుషిత వ్యసనసప్తకం] బనఁ బరఁగున్. 658

నీతిసారమువ. అట్టివ్యసనంబులు సహజాగంతుకభేదంబుల లెండుదెఱంగు లందు సహజంబుల గుర్వాజ్ఞాధర్మశాస్త్రంబుల నూతనపుణ్యోఖ్యానంబు లాకర్ణించియు నుపశమింపఁ జేయునది. 659

సీ. స్త్రీ సేవ ఘనమైనఁ జెడు దేహధనములు
పానాభీరతి మతిభ్రష్టుఁ జేయుఁ
దల్లి చచ్చినను జూదరి లేచిపోవండు
మృగచోరబాధలు మృగయఁ గలుగు
ధన మప్రయోజనదత్తమై ధనపతి
కైనఁ బేదఱికంబు నావహించుఁ
బలుకుప్రల్లదమును బరుసనిశిక్షయుఁ
బగసేయు ధరఁ గల ప్రజల నెల్లఁ
ఆ. గాన వీని విడువు గడఁకమై మఱియును
ధనము యశము ప్రాణమును హరించు
సాహసంపుఁబనుల చక్కటిఁ బోవక
పాటి యనక యుండ బ్రతుకవలయు. 660

అజ్ఞాతముక. ఏకమృగభూవినోద
వ్యాకులుఁ డగునేనిఁ దతి పురాంతికభూమిన్
శ్రీకరమృగయారణ్యము
గైకొని చెయింపవలయుఁ గడుసౌఖ్యముగన్. 661

వ. అది యెట్లనిన. 662

సీ. నగసమీపంబున నదిపొంతనేనియు
బహుజలశాద్వలప్రకటభూమి
నిడువు వెడల్పును నెళి యర్థయోజన
సమ్మతమై కడుఁ జదరముగను
మృగలంఘనీయమై యోగి నన్యదుర్గమై
యురుపరిఖాచక్ర మొప్పు మిగులఁ
గంటకోత్కరలతికాగుల్మశూన్యమై
వరవిషపాదవర్జితముగ
గీ. జ్ఞాతపూర్వంబులై మనోజ్ఞంబు లగుచు
సురభిఫలపుష్పగంధముల్ విరళములును