బనఁ గలయన్నిమార్గముల నర్థము గూర్పకకేవలంబ కాఁ
పున పొలియించురాజు సిరి పొందులె రాజమనోజభూభుజా. 99
బద్దెననీతి
క. జనపతి పర్జన్యునిగతిఁ
దనభూప్రజఁ బ్రోవవలయుఁ దగఁ బ్రోవడయేఁ
దనుఁ బాసిపోవు నాప్రజ
ఘననీరససరసిఁ బాయు ఖగములభంగిన్. 100
నీతిసారము
క. ఉత్తమయానములును ఘన
విత్తములును రత్నధాన్యవితతులు నయసం
పత్తినిఁ బ్రజఁ బాలింపక
యెత్తెఱఁగునఁ గలుగు ధారుణీశుల కరయన్. 101
ఆ. ఫలము కాససేయు పతిగాక నీతితో
భూమిప్రజల నరసి ప్రోవవలయు
నీరు ప్రోదిపెట్టు నెఱిమాలకరివాఁడు
పువ్వుఁదీగ లరసి ప్రోచినట్లు. 102
పంచతంత్రి
క. తననగరిలోన నించుక
యును భాండాగార మనుచు నునికి దగదు రా
జునకుఁ బ్రజలె భండారం
బని యేమఱ కరయవలయు ననిశము వారిన్. 103
నీతిభూషణము
క. ప్రజఁ దల్లి పెంచుతెఱఁగున
ప్రజఁ బతి బెంచునది పెరిఁగి పదపడి తల్లిన్
బ్రజప్రోపు సందియము పతి
బ్రజప్రో పది నిక్కువంబు బద్దెనరేంద్రా. 104
క. క్రూరుఁ బ్రజ విడుచు నోడఁగ
నేరదు సౌమ్యునకుఁ గాన నృపతి ప్రజను సా
ధారణరూపంబున నయ
పారగుఁడై యేలవలయు బద్దెనరేంద్రా 105
బద్దెననీతి
క. ఆపదలఁ జెందు ప్రజలను
భూపతి మొద లిచ్చి మగుడఁ బ్రోవఁగఁ దాఁ
జేపట్టి విడువవలవదు
భూపతికిఁ గుటుంబ మనఁగ భూమియ కాదే. 106
నీతిసారము
క. చాలఁ బ్రజఁ బ్రోవకయ తాఁ
గోలాసన్ బాఁడి దప్పి కొనుచుండెడి భూ
పాలకుఁడు కుప్పఁ జిచ్చిడి
పేలా ల్వెదకికొని తినెడిబేల తలంపన్. 107
పురుషార్థసారము
క. మండలము సెడినఁ బతి సెడు
మండలమును బతియుఁ జెడ్డమాత్రనె చెడు న
మ్మండలముఁ బతియుఁ గావడి
కుండలవలె నుండవలయుఁ గొమరుర భీమా. 108