Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్గసంరక్షణము

ఉ.

శ్రీపతిఁ బోలు భూపతియుఁ జెల్వగుమంత్రియు రాష్ట్రదుర్గము
ద్దీపితకోశసైన్యము లుదీర్ణసుహృజ్జనులుం బరస్పర
వ్యాపిమహోపకారు లగు నట్లుగ రాజ్యనిజాంగబుద్ధిమై
నోపి పరీక్షసేయవలయు న్నిజశిక్షణలక్షణంబులన్.

44


ఉ.

అరసి రాజకంబుల ప్రజావలి కెల్ల నివాస మయ్యు భం
డారములున్ బలంబుఁ బ్రకటంబుగఁ దాఁపఁగఁ బోలు దుర్గ మే
భూరమణీశుఁ డేలుఁ బరిపూర్తిగ వానికి వశ్యులై ప్రజల్
భూరిధనంబు గూర్తు రది వోలునె కాదె నిజాభిరక్షకున్.

45


క.

విమతుల కగమ్య మగు దు
ర్గము లేకుండినను బ్రజకు రాజుకుఁ దమదే
శము లిడుమం బడు ధనధా
న్యము లుండినఁ బిదపఁ బ్రాణహానియుఁ గల్గున్.

46

కామందకము

క.

తనప్రజకుఁ బిదప నిర్భయ
మని యూఱడి తొలఁగిపోయి యహితుల గెలువన్
(జనియైనఁ జుట్టుముట్టినఁ)
దునుము నృపుం డశ్రమంబు దుర్గబలమునన్.

47


క.

పులు లుండుఁ బొదల నేనుఁగు
లలఘుగిరీంద్రముల నుండు ననిశము సింహం
బుల గుహల నుండుఁ గావున
బలవంతుల కైన దుర్గబల మది వలయున్.

48


ఆ.

అలహిరణ్యకశిపు నలజడికై యోడి
విశ్వకర్మచేత విశ్రుతముగ
గురునియనుమతమునఁ గోటఁ బెట్టింపఁడే
యమర నమరనాథుఁ డమరపురికి.

49


ఆ.

ధరణి మదము లేని కరులునుబోలె దం
ష్ట్రములు లేని పన్నగములుఁ బోలె
నరయ దుర్గరహితులైన రాత్రీశ్వరు
లవని కెల్ల నసదు లగుదు రెపుడు.

50


క.

పరులకు దుర్గము వలదే
హరువరమున భువనవిజయుఁ డగు రావణుఁడున్
శరధగిరిప్రాకారో
త్కరపరివృతమైన లంక ఘన మని యుండున్.

51

పురుషార్థసారము

గీ.

చుట్టువాఱ వెలుగు గట్టిగా నిడికొని
యున్వారిఁ గడిఁది యోర్పు టనిన
నురుతరంపు దుర్గ మొకటి ప్రవేశించి
బలసికొనినపిదప గెలువ వశమె.

52

పంచతంత్రి