Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పలుకుల తీపును సరసము
చెలువము నడబెడఁగు బంధచిత్రము సొబగున్
గలకలనఁ జూపవలదే
కలకంఠియుఁ బోలెఁ గవిత కందనమంత్రీ.

30

నీతితారావళి

క.

సరసకవితరుచి యెఱుఁగని
పురుషులఁ బశువులని నిక్కముగ నెఱుఁగుఁడు వా
రురుపడిఁ దృణంబు మేయమి
పరికింపఁగ ధరణిఁ బసుల భాగ్యం బెందున్.

31


ఉ.

సుందరసర్వలక్షణవిశుద్ధకవిత్వము గన్నచో రస
స్యంది నిజస్వభావుఁ డనఁ జాలినయట్ల నిజస్వభావుఁ డా
నందముఁ బొందునట్లు కుజనప్రకరంబు లెఱుంగ నేర్చునే
చందురుఁ జూచి మోదమున సాగర ముబ్బిన నూతు లుబ్బునే.

నీతిభూషణము

నీతిశాస్త్రప్రశంస

మ.

నయమార్గంబున లక్ష్మి లక్ష్మిగలచో నారాయణుం డుండు ని
శ్చయ మచ్చో పరధర్మవృత్తికి నిజస్థానంబు తన్మూలమై
జయ మెల్లప్పుడు నుల్లసిల్లుఁ ద్రిజగత్సంసేవ్యమై కావునన్
నయశాస్త్రంబె వివేకధన్యునకుఁ జింతారత్న మెల్లప్పుడున్.

33


గీ.

వ్యసనములు మాని రాజు విత్వత్ప్రసంగ
సంగియై పురాణేతిహాసములు వినుచు
నీతి వినునేని నృపతికి నేర్పు మిగులు
వసుధఁ బామున కెఱకలు వచ్చినట్లు.

34


ఆ.

నీతి యెఱుగువాఁడు నిఖిలంబులందును
ఖ్యాతిలాభపూజలందు నొప్పు
గాక యొరుఁడు పొందఁగలఁడె నేర్పునకు
వివేకమునకు నూఁత వెరవకాదె.

35

నీతిసారము

చ.

అనుచుఁ దలంచి రాజసచివాధిపు లెంతయుఁ బ్రేమతోడఁ బ్రా
ర్థన మొనరింప సర్వజనతాహితబుద్ధి వహించి యంధ్రవా
గవనధివిలాసవీచికల వారక తెప్పలఁ దేల్చియింపు సొం
పినుమడిగా నయామృతము నిచ్చెద మెచ్చులు పల్లవింపగన్.

36