పుట:Sahityabashagate022780mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సృష్టించారనే వాదన ఎంత మాత్రమూ గ్రహ్యమైనది కాదు. అట్లా తలపోయడం ప్రాచీనులకు మహాపచారం చెయ్యడమే అవుతుంది. ఎందుకంటే పూర్వమహాకవులెవరు చెప్పినా లోక ప్రయోజనం కోసం. జగద్దితం కోసం వ్రాస్తున్నామన్నరే కాని స్వాత్మానందం కోసం, లోకాన్ని నిర్లక్ష్యం చేసి కావ్యరచన చేస్తున్నామని ఎక్కడా ఎవరూ అనలేదు. భవభూతి వంటి మహాకవి ఏదో ఒక సందర్భంలో సమాలికుల దుర్విమర్శలకు చిరాకుపది ఈ లోకంతో నాకేమిపని అని ఘూర్ణిల్లి యుండవచును.

                     "యేనామకేచి దిహన: ప్రధయంత్యవజ్ఞాం
                      జానంతితే కిమని, తాస్ప్రతి నైషయత్నం:|
                      ఉత్పత్స్యతే మమతు కోసి సమానధర్మా|
                      కిఆలోహ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ|"

    'నా యొక్క అజ్ఞతను ప్రకటించడానికి కొందరు పూనుకో వచ్చును.  అయితే వారికిమాత్రేం ఏమి అధికంగా తెలుసును? నా యీ ప్రయత్నము వారి నుద్దేశించినది కాదు.  నాతో అమానమైన భావాలూ తిచ్చవృత్తీ కలవ్యక్తి భవిష్యత్తులో జన్మించక పోవడు;.  కాలము అనంతమైనది.  ఈ పృద్వీమందలం విస్తారమైనది. '  సమాన ధర్మం కలవారినిగూర్చి ఈ నాటకరచన చెయ్యబడుతూందని ఈషత్కోపంతో కవి పలికాడు.  అంతమాత్రంచేత భవబోఒతి లోకాన్ని నిర్యక్ష్యం ఛేసి తనకు ఇష్టంవచ్చినట్లు సాహిత్య సృష్తి ఛేశాడని అనవచ్చునా? కవి కూడా మానవ మాత్రుడే. అతనికీ రాగద్వేషాలు ఉన్నాయి.  ఆశానిరాశలు ఉంటాయి అని సరిపుచ్చుకోవాలి.  విపరీతబాష్యాల్కు చెయ్యడం న్యాయం కాదు.
    తెలుగు కవీంద్రుడైన చేమకూర వెంకటకవి కూడా సమకాలికుల విమర్శకులకు ఇట్లాగే నొచ్చుకున్నాడు.  'ఏగతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే గదా అని బాధ ప్రకటించాడు.  ఇంతమాత్రంచేత చేమకూర వెంకటకవి లోకాన్ని నిర్లక్ష్యంచ్?ఏసి వ్రాశాడ ' ని అనడం ధర్మమవుతుందా.  శ్రీనాధమహాకవి శృంగార నైషధంలో అన్నాడు.

            "పనిపడి నారికేళ ఫలపాకమునం జనియైన భట్టహ
              ర్సుని కవితాగుంభములు సోమరిపోతులు కొదఱయ్యలౌ
              నని కొనియాడినేర రదియట్టిద లేజవరాలు చెక్కుమీ
              దన వసవల్చు బాలకుడు డెందమునం గలగంగ నేర్చునే||"