పుట:Sahityabashagate022780mbp.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాహిత్య భాషగా తెలుగు

    పూర్వ యుగాల్లో సాహిత్య ప్రయోజనాలకూ లౌకిక ప్రయోజనాలకూ వాడబడే భాషల్ స్పుటమైన భేదం కలిగి ఉండేవి.  ఇరవయ్యో శతాబ్ధంలో సాహిత్యకుల దృష్టిపధం మారింది.  కావ్య భాష కూడా నిత్య వ్యవహారంలో ఉండె భష లాగే ఉండాలనే భావము ఇప్పుడు దృడపడుతూంది.  ఇటువంటి ఉద్దేశం పందొమ్మిదవ శతాబ్ది చివర భాగంలోనే సాహిత్య చింతకులలో తలయెత్తింది.  దానిపై పెక్కు వివాదాలు చెలరేగాయి.  క్రమంగా శిష్ట వ్యావహారికమే సాహిత్య భాషఘా స్థానం పొందాలని చాలామంది రచయితలు భావింపజొచ్చారు. పూర్వయుగాల్లో దీనికి భిన్నంగా భావించేవారు.  వారి ఆలోచనా పరంపర ఇట్లా ఉండేది.  "సాహిత్యమనగా రసప్రపంచము. రసము పరబ్రహ్మ స్వరూపము.  రసోవైసం: అని ఉపనిషత్తు చెప్పుతూంది.  బ్రహ్మ స్వరూపమైన రసాన్ని ప్రస్తరించే సాహిత్య భాష, ప్రతిపాద్యమైన వస్తువు ఔత్లృష్ట్యాన్ని బట్టి కేవల లౌకిక వ్యవాహారము ప్రయోజనముగా గల భాష కంటె కొంత భిన్నమై, విలక్షణమై, ఉదాత్తమైనదిగా ఉండాలి"  ఇది ప్రాచీనుల దృష్టిపధము ఆదునికులైనా దీని8ని బొత్తిగా కాడనడంలేదు.  విఫణి వీధిలో కొనుగోళ్ళకు అమ్మకాలకూ వాడే భాషకాని విశృంఖలంగా మాట్లాడేటప్పుడు ప్రయోగించే పద స్వరూపాన్ని కాని, పద జాలాన్ని కాని యధాతధంగా సాహిత్యంలో వాడవచ్చునని నేటి కాలపు సాహిత్యకులు కూడా అనడంలేదు.  అందుచేతనే కావ్యాల్లో వాడే భాష "శిష్ఠవ్యవరారికం 'గా ఉండాలని వారుకూడా అంటున్నారు. పూర్వులకూ వీరికీ భేదం ఎక్కడ అంటే వ్యహారంలో ఉండే పదజాలాన్నీ, పదస్వరూపాన్నీ సాహిత్యంలో సుతరామూ వాడ కూడదని వారు నియమం పెట్టుకోలేదు.  అయితే ప్రాచీనౌలు మాత్రం ఇటువంటి ప్రతిషెధం పెట్తుకున్నారా?  పెట్టుకుంటే వారి రచనలు లోకానికి ఎట్లు ఉపాదేయము లయ్యెడివి.  వారు రచించిన పురాణాలకు, కావ్యాలకూ లోకం ఎట్లా గ్రహించేది? ఎట్లా ఆస్వాదించేది? లోకంతో మాకు పనిలేదు మా ఇష్టము వచ్చినట్లు మేము వ్రాసుకుంతాము.  లోకులకు అర్ధం అయినా అవక పోయినా వారు ఆస్వాదించినా ఆస్వాదించక పోయినా, మాత్రోవ మాది.  అనే ధోరణిలో ప్రాచీనులు కావ్యజాలం