పుట:Sahityabashagate022780mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

70

అధర్వణుని సూక్తిని పేరు పాటించారు. అయిననూ కావ్యం ఆద్యంతం వాడుక భాషలో వ్రాయడానికి గాని వచన గ్రంధాలైనా ఈ పద్దతిలో నడిపించడానికి గాని వీరెవరూ సమ్మితంపలేదు. అనాది నుంచీ వస్తూన్న భాషా సంప్రదాయాల్ని విచ్చిన్నం చెయ్యడానికి పండిత వర్గము వారు, పూర్వ చంప్రదాయపు కవులూ సంసిద్ధంగా లేదు. ఈకాలంలో అనగా 19వ శరాభ్ది చరమ పాదములోనూ 20వ శరాబ్దపు ప్రధమ పాదంలోనూ దిగ్దంతల వంటి మహకవులు బయలుదేరి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ వచ్చారు వావిలికొలను సుబ్బారావుగారు, జనమంచి శేషాద్రిశర్మగారు, దాసు శ్రీరాములుగారు, తిరుపతి వెంకట కవులు వంటి మహానీయులెందరో పెక్కు ఉదాత్త గ్రంధాలు వ్రాశారు. పురాణాలు అనువదించారు. వావిలికొలను సుబ్బారావు గారి వంటి వారు భాషా పరి/శుద్ద్యాన్ని ఏమాత్రమూ సడలించడానికు విముఖులు. తిరుపతి వెంకట కవులు పద్యరచన వరకూ పూర్వరీతులనూ వ్యాకరణాన్ని మన్నిస్తూనే వాటిని జనసామాన్యానికి వీలైనంత దగ్గరగా తీసుకురావడానికి విములుకారు. వచన రచనలో కూదా ఒక దారీ తెన్నూలేని వాడుక భాష వ్రాయవచ్చని నిరూపించారు కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులుఘారు. వీరు విజ్ఞాన చంద్రికా గ్రంధ మండలి స్థాపించి దానిలో పెక్కు చరిత్ర గ్రంధములు, పదార్ధ విజ్ఞాన శాస్త్రము వంటి ఆధు నిక భౌతిక శాస్త్ర ప్రమేయం గల గ్రంధాలూ, విజ్ఞాన సర్వస్వం వంటి వైజ్ఞానిక రచనలూ విరివిగా ప్రకటించి కావ్య భాషను ఆధునిక ప్రయోజనాలకు అనుకూలం గా ఎట్లా మలచాలో ఆచరణలో చూపెట్టారు.

  ఈ విధంగా దేశంలో సాహిత్యభాష ఎట్లుండవలెను- సులభ గ్రాంధికమా? శిష్ట వ్యావహారికమా-అనే విషయంపై మన మేధావులంతా రెందు వర్గాలుగా ఏర్పడి దేవాసుర సంగ్రామములాగ ఓహరిసాహరిగా పాతికముప్పది సంవత్సరాలు ఈ సాహిత్య సమరాలు సభాముఖంలో వాగ్రూపంగాను పత్రికల్లో లేఖిని సహాయం తోను జరిగాయి. ఇటువంటి సముద్రమధనంవలన కాలాంతరంలో దేశానికీ, భాషకూ మంచిమేలే జరిగింది.  తమ తమ వాదాల్ని యుక్తియుక్తంగా సమర్దించుకోడానికి ఉభయ వర్గాలవారు భాషా తత్వాన్ని గురించి గంభీరంగా ఆలోచించి వ్రాయడం చేశారు.  ఆంగ్లభాషవంటి విశ్వన్యాప్తమైన భాషాదృశ్యంతో సిద్దాంతాలు ఉత్ధాపితంచేసి, సముద్రపుకరకళ్ళలాగ వాటిని భంజించి గొప్ప చర్చలు సాగించారు.  మాండలిక భాషాస్థితినీ, ప్రయోజనాల్ని