పుట:Sahityabashagate022780mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

69

      ఈ విపరీత పరిణామం మీద 19 వ శతాబ్దం చివరి పాదంలోనే తిరుగుబాటు బయలుదేరింది.  గురజాడ అప్పారావుగారు, గిడుగు రామమూర్తి పంతులుగారు మొదలగు నిజ్ఞలు బహుశ ప్రయోజనాలు సాధించవలచిన నేటి కాలపు వచనానికి కూడా ప్రాతవడిన కావ్యభాషకు వర్తించే నియమాలు వర్తింప చెయ్యడం తగదనీ, సర్వతో ముఖాబివృద్ది పొందవలసిన భాషకు ఇది గొడ్డలిపట్టు అనీ తీవ్రంగా నిరసించడం ఆరంభించారు.  కావ్యాలు మట్టుకు ఎట్లా ఉండినా లౌకిక ప్రయోజనాలకు దేశంలో పెద్దలువాడే వ్యావహారిక భాషను వాడే సంప్రదాయం చిరకాలం నుంచీఉన్నదని గిడుగు రామమూర్తి గారు తాళపత్ర గ్రంధాధారాల్తో స్థాపించడానికి విశేష పరిశ్రమ ఛేశారు.  మిక్కిలి ప్రాచీన శాసనాల్లొ 'ఇస్తిమి ' వంటి 'స ' రూపోఅలుండేవని శాసన వాజ్మయం శోధించి ప్రకటించారు అప్పారావు గారు. శిష్ఠ వ్యావహారిక భాషను వచన ప్రయోజనాలకు ఉపయోగించె ఉద్యమాన్ని విద్యావంతులైన ఆంగ్లేయ ఉద్యోగులు కొందరు సమర్ధిస్తూ వచ్చారు.  వీరందరూ కలిసి బాషా విషయిక కాన్ఫరెన్సులు, సమావేశాలు నదిపారు.  వచనమే కారు, కిఅవిత్వానికి కూడా ప్రాతబడిన సాహిత్య భాష ఉపయోగించదనీ, అది నేదు రసానుభూతిని కలిగించలేదని వాదించారు.  గురజాడవారు. సాహిత్య వేదిక మీద వ్యవహార భాషను అధిష్ఠితం చెయ్యడానికి వారు తమ కన్యాశుల్క నాటకాన్ని ఉత్తరాది మాండలికంతో గూదిన వ్యవహార భాషలో వ్రాసి, ప్రకటించి, ప్రదర్శింపించి సాహిత్య కాసారంలో ఒక కల్లోలం లేపారు.  క్రమక్రమంగా చందో విషయంలో కూడా అప్పారావుగారు నూతనత్వాన్ని ఆశ్రయించారు.  పూర్వపు అక్షర గణ చందస్సులను వదలిపెట్టి మాత్రాగలు బద్ధములైన దేశీయ చందస్సును ప్రచారంలోకి తెచ్చారు.  వాటిలో గేయ రీతులచే వీరు అభిమానించి పెక్కు రదనలు చేశారు.  ముత్యాల సరాలు అనే పేరుతో ఇవి తరువాత ప్రకటింప బడ్డాయి.  దీర్ఘ కావ్యపద్దతిని విసర్జించి కధా ప్రధానములు రస నిర్బరములు అయిన చిన్నచిన్న కావ్యాలను వ్యవహార భాషలోనే ఆవిష్కరించారు.
    ఈ ఉద్యమాన్ని విజ్ఞలైన మరి కొందరుల్ పెద్దలు అభినివేశంతో వ్యతిరేకించారు.  వారిలో కొందరు ప్రకరణోచితంగా వాడుక భాషను సాహిత్య గ్రంధాల్లో వాడడానికి విముఖులు కారు.  కందుకూరి వీరేశలింగం పంతులు గారు తమ ప్రహసనాల్లో వాడుక భాష ప్రయోగించారు. వేదం వెంకట్రాయ శాస్త్రుల వారు ప్రతాపరుద్రీయ నాటకంలో పాత్రోచితంగా వ్యవహారి భాష వాడారు. "గ్రామ్యం తతద్విధౌ సాధు" అను