పుట:Sahityabashagate022780mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68

స్సును సమర్ధించాలన్నా, విమర్శించాలన్నా అప్పకవి పేరు ఎత్తక ఎవరికీ జరుగదు. చిన్నయసూరిగారు చేసిన మఱియొక ప్రముఖ ప్రయత్నం ఏమిటంటే తాను నిర్మించిన వ్యాకరణం ప్రకారం వచనగ్రంధం వ్రాయడము, సలక్షణమై ప్రసన్న శైలిగల ఉత్తమ కవిత్వానికి నన్నయభట్టారకుడుని ఎట్లా చెప్పుకుంటున్నామో సలక్షణమైన ప్రసన్నరీతి గల ఉత్తమ వచన రచనకు చిన్నయసొరిని మొదట చెప్పాలి. ఆయన వ్రాసిన మిత్రలాభ మిత్రభేదములను గురజాడ అప్పారావుగారు కూడా మెచ్చుకున్నారు. కాని ఆధునికులచేత నిశిత విమర్శలక్జు గురియైనవాడు చిన్నయసూరి వంటివాడు మరొకడులేడు. ఈ వైరుద్యం ఎట్లా వచ్చింది.

     చిన్నయసూరి చెప్పాడీ లేదో కాని అన్నిరకాల వచన రచనకూ పండితులు ఇప్పటినుంచీ బాలవ్యాకరణాన్ని అనుశాసన గ్రంధంగా తీసుకొని పిల్లలకు వాచకాలు వ్రాసినా, విశ్వవిద్యాలయ విద్యార్ధులకు పాఠ్యగ్రంధాలు వ్రాసినా, జనసామాన్యుల అందరిచే వినోద గ్రంధాలు, యాత్రాకధనాలు, శాస్త్రగ్రంధాలు, వ్యాఖ్యానాలు ఏవి వ్రాసినా పూర్వకావ్యాల్లో కనబడే శైలివంటి శైలిని పాటిస్తూవచ్చారు.  ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లోంచి, విద్యాసంస్థల్లోంచి సజీవమైన వ్యవహారభాష అదృశ్యమయింది. దాని స్థానంలో పద్యకావ్యశైలి ఛోటు చేసుకుంది.  పండితులు ఒకరినిమించి మరియొకరు అనుప్రాసారి శబ్ధాలంకారమయము, శ్లేషనిబిడము, నిఘంటుమాత్రదృశ్యములైన పదబంధురమూ అయిన కృతకశైలిని వచనరంగంలోకి కూడా దింప్ వచనప్రయోజనాన్ని వమ్ము చెయ్యజొచ్చారు.  కందుకూరి వీరేశలింగం పంతులుగారివంటి అభివృద్దికాముకులు కూడా కొంతకాలం దీని ప్రభావంక్రిందికి వచ్చారు.  వారి విగ్రహతంత్రము ఇందుకు ఉదాహరణము.  వారు పిల్లలకు వ్రాసిన వాచకాలుకూడా బాలురకు అపరిచితమైన భాషలో నడిచాయి.  కాని పంతులుగారు త్వరలోనే ఈవిధమైన కఠినశైలికి స్వస్తిచెప్పి సులభము లాక్షణికము అయిన భాషలో వచన రచన చెయ్యడానికి నిశ్చయించు కున్నారు. దానిని ఆచరణలో పెట్టారు.  ఇతర పండితులు ఈ మాత్రపు భాషా వివేకం కూడా చూపెట్ట లేక కావ్యశైలికే అంకితమవుతూ వచ్చారు. దీనివలన జరిగిన మొదటి ఎద్దనష్టం ఏమిటంటే తెలుగుదేశంలో భావప్రకటన చెయ్యడానికి సాధారణ భాషాపరిజ్ఞానం కలవారంతా భయపడిపోయి మానుకున్నారు.  ఇప్పటి విద్యావసరాలనుబట్టి అనేక శాస్త్రాల్లో గ్రంధాలు తెలుగులో వెలువడ వలసిందిగా రచయితలు కావ్యభషాస్థాయిని అందుకోలేమని వ్రాసే ప్రయత్నాన్నే విరమించుకున్నారు.