పుట:Sahityabashagate022780mbp.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

61 తెలుగులోవచ్చి చేరాయి. మరిన్నీ, ఈ కాలంలో శైవమతం కొంత తగ్గుముఖంలో ఉండి వైష్ఠవమతం రాజస్థానాల్లోన్ ప్రజల్లోను ఎక్కువ ఆదరం పొందడం జరిగింది. వైష్ఠవమతాచార్యులు తత్వవేత్తలు ప్రదానంగా అరవదేశాన్నించి వచ్చేవారు కనుక ఆ మత పరిభాషా పరంగా కూడాకొన్ని తమిళశబ్ధాలు తెలుగులో చేరాయి. కన్నడ దేశంతోను వీరశైవంతోను గాఢ సంబంధం ఉండినకాలంలోకన్నడపదాలు కొన్ని ఇట్లాగే తెలుగులో ప్రవేశించాయి. దేశంలో ముసల్మానులతో సంబంధం ఏర్పడి మూడు నాలుగువందల సంవత్సరాలు గడిచిపోయాయి. మొదట మొదట వారికీ మన వారికీ మూసరమర్జాల సంబంధమే ఉండినా కాలంగచినకొద్దీ వారూ మనమూ కలిసి పోక తప్పలేదు. ఒకేగాలి పీలుస్తూ, ఒకేనీరు త్రాగుతూ ఒక మట్తిలోనే పండిన పంటలు తింటూ శాశ్వత శత్రుత్వం సాగించాలన్నా సాధ్యంకాదు. ప్రభుత్వాలమధ్య ఇప్పటికీ వైరాలు యుద్ధాలు సాగుతూన్నా ప్రజానీకంక్రమంగా ఏకమవడం తప్ప లేదు. హిందూరాజ్యాలు పడిపోయిన తర్వాత పాశ్చాత్య ప్రభు;త్వం ఏర్పడేదాకా ముసల్మానులు విస్తృతమైన దేశబాగంలో ప్రభుత్వం చేశారు. ముఖ్యంగా గోల్కొండ సుల్త్లానులు తెలుగుదేశంలో చాలా భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. పాలకులు ముసల్మానులవడంచేత వారి భాషలైన పార్శీ ఉర్దూ భాషలు రాజభాషా స్థానంలో నిలిచాయి. తత్కారణంగా సంఖ్యాక ఉర్దూ-పార్శీ పదాలు తెలుగు భాష లోకి వచ్చిపడ్డాయి. వచ్చి స్థిరంగా నిలిచిపోయాయి. ఇవి యెక్కువగా వ్యవహార భాషలోనే వాడబడినా కొన్ని కొన్ని సాహిత్య భాషలో కూడా అప్రయత్నంగా దూరాయి.

   చిట్ట చివరికి తెలుగు సాహిత్యపు కందెలను దిగ త్రొక్కుకుంటూ వచ్చి పడ్డాయి  పాశ్చాత్య భాషా పదాలు క్రీ.శ. 16 వ శతాబ్ధం ప్రారంభం నుంచీ ఒక్కరొక్కరుగా సంద్రాల మీదుగా వచ్చి పాశ్చాత్య దేశీయులు మనతో, మనదేశంలో వర్తకంఅ ప్రారంభించారు.  వీరిలో పోర్చుగీసువారు ముందు వచ్చారు.  వీరిని మనవారు బుడతకీచులనడం చేత వీరిని మనవారు ఓలాంధులు అని పిలిచేవారు-వీరిద్దరి తరువాత వచ్చారు ఫ్రేంచి వారు, బ్రిటిషువారు, ఫ్రెంచివారిని పరాసులు అనేవారు. బహుశా వారి ముఖ్యపట్టణమైన పారిసునగరం పేర ఈ తద్బవ పదం ఏర్పడి ఉంటుంది. మనకు ఇప్పటికీ సుపరితులైన వారు ఆంగ్లేయులు, వీరిని ఇంగిరీజులని పిలిచేవారు.  వర్తకం కోసం వచ్చిన వీరందరూ, మత ప్రచారకులుగానూ, రాజ్య సంస్థాపకులుగానూ వ్యవ