పుట:Sahityabashagate022780mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

60

చెందింది. అందులో తంజావూరు రాజ్యం విశిష్టస్థానం అలంకరిస్తూండడంచేత దీన్ని తంజావూరు యుగము అన్నాము, మధుర, మైసూరు, పుదుచ్చేరి మొదలైన సంస్థానాలు కూడా ప్రశంచనీయమైన సేవచేశాయి ఈ యుగంలో చిరకాలం నుంచి వస్తూన్న ప్రబంధ ప్రక్రియయేకాక ఎన్నో ఇతర ప్రక్రియల్ ఆచరణలోకి వచ్చాయి. ముఖ్యంగా వచనము. ఇదివరలో చంపూకావ్యాల్లో అక్కడక్క్జడ చిలరించినట్లు మాత్రమే కన్పడే గద్య ప్రక్రైయ ఈ యుగంలో ప్రత్యేక రూపంచాల్చి సంపూర్ణవచనైక గ్రంధాలుగా అవతరించింది. రామాయణ భారత కధలూ, తీర్దమాహాత్మ్యాలు వంటి గద్య రచనలు బయలుదేరాయి. యక్షగానము అనే పేరుతో నాటక ప్రక్రియ కూడా విరివిగా వ్యాపించింది. ఇది దేశీయ నాటక పద్దతి. సంగీత బహుళమై కొన్ని నాటక లక్షణాలు గలిగిఉంటుంది. సంస్కృత నాటకం అంత శాస్త్రీయ పద్దతిమీద ఉండదు కాని దేశీయమగుటచేత ప్రజల్ని, ప్రభువుల్ని కూడా చాలా ఆకర్షించింది. శతక రచన ప్రాచీనం నుంచీ ఉంటూన్న అప్పుడు విరళ విరళంగా ఉండేరి. ఈ యుగంనుంచీ అది వాగా వ్యాప్తిచెంచి ఎన్నో శతకాలు వెలువడ్డాయి. ఇవి కాక పాటలు, కృతులవంటి గేయ సాహిత్యం విస్తారంగా ఉద్బబించింది. తెలుగురాజుల ఆస్థానాల్లో తెల్కుగ్ రాజభాషగా చెల్లుతూండేదని మనం ఊహించచచ్చును. రాయవాచకంవంటి రచనలు దీనికి ఉదాహరణంగా చప్పవచ్చు. ఇన్ని బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడవలసిన తెలుగుభాష పూర్వం పురాణాల్లో ప్రబంధాలలో మాత్రం వ్రాసినదినాల్లో ఉన్నంత శుద్ధంగాను ఉన్నతంగాను, సుశిల్పితంగాన్ ఉంటుందనడం సాధ్యంకాదు. ఆయా నూతన ప్రయోజనాలకు తగినట్లు క్రొత్త క్రొత్త శబ్దాలు భాషలోవచ్చి చేరకతప్పదు. కేవలం పండితులకేకాక పామరులకూ సాధారణ పరుజ్ఞానం కలవారికీ కూడా భాష అందుబాటులో ఉండాలి. అందుచేత వ్యావహారిక ప్రయోగాలు, పూర్వ వ్యాకరణ విరుద్ద ప్రయోగాలు రచనల్లో చోటుచేసుకొనక తప్పలేదు.

   మరొక విశేషం కూడా జరిగింది.  అన్యభాషా శబ్దాలు ఈ కాలంలో విస్తారంగా తెలుగును ప్రవేశించాయి.  తెలుగులో కలిసిపోయి అనినాభావ సంబంధంతో నిలిచి పోయాయి.  దీనికి పెక్కుకారణాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సాహిత్యానికి దక్షిణదేశం ప్రధాన రంగము అయింది.  గనుకిఅ అక్కది ప్రజాభాషయైన తమిళము తెలుగులో కొంతకలిసింది.  ముఖ్యంగా యక్షగానాల్లో ఇది కనబదుతుంది.  యక్షగానాలు ప్రదర్శినానికి ఉద్దేశింపబడడంచేత దక్షిణదేశంలో తెలుగువారికి పరిచితమైన అరవ పదాలు తెలుగులో వాడితే ప్రేకిషకులు సంతోషించేవారు.  ఆ విధంగా తమిళ పదాలు

.