పుట:Sahityabashagate022780mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

59 గాన్నే గొప్ప పాండిత్యంతో నిర్వహించాడు. రానురాను ఈ ప్రక్రియ నాలుగర్ధాల కావ్యాలదాకా వ్యాపించింది. మొదటి ద్వ్యర్ది కావ్యాల్లో స్పష్టాస్పష్టంగా ఉండే రసప్రమేయం బొత్తిగా అదృశ్యమయింది. తిక్కన సోమయాజి తరువాత స్వతంత్ర భావనా సంపదగల మహాకవి పింగళి సూరననార్యుడే అని విజ్ఞలు భావిస్తారు.

     ఇక రెండవ భాషాప్రయోగం అచ్చతలుగు కావ్యం వ్రాయడం. ఇక్కడ అచ్చతెనుగు అనగా తత్సమశబ్దరహితమైన భాష అన్నమాట.  దానిలో తద్భవాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలు కూడా చేరుతాయి.  తత్సమ శబ్దరహితంగా కూడా కావ్యం అంతా వ్రాయవచ్చునని నిరూపించిన బుద్దిశాలి పొన్నికంటి తెలగనాధ్యుడు, ఇతడు గోల్కొండ రాజ్యంలో వర్దిల్లినవాడు.  ఇబ్రహీం కుతుబుషా అనుచరుడైన అమీను ఖాన్ అను సర్దారుకు తన అచ్చతెలుగు కావ్యమైన 'యయాతిచరిత్ర ' ను అంకితం చేశాడు.  శుద్ధాంద్ర కావ్యాన్ని గూర్చి కృతిపది ఈ విధంగా అన్నాడు.

     "అచ్చతెనుంగు బద్దె మొకటైనను గబ్బములోన నుండినన్
      హెచ్చని యాడుచుందురది యెన్నుచు నేర్పున బొత్తమెల్ల ని
      ట్లచ్చ తెనుంగునన్నొడువ నందుల చంద మెఱుంగువారెదన్
      మెచ్చరొ యబ్బురంబనరొ మేలనరో కొనియాడరో వినున్"

  ఇదికూడా చమత్కారమైన ప్రయోగమే.  సంస్కృతభాషా సహాయం లేకుండా తెలుగు కొంతైనా తలయెత్తి తిరుగగలదని నిరూపించినమాట నిజమే.  తరువాతి కాలంలో కూచిమంచి తిమ్మకవిసార్వభౌమునివంటి వారు దీనికి బలంచేకూర్చారు. ఇది వేరింటి కాపురం ఎట్టగలమని నిరూపిస్తుందేకాని స్థిరమైన సంతోషం ఇవ్వజాలదనడం ఈ జాతి కావ్యాలు వ్రేళ్ళమీద లెక్కింపదగినవిగా ఉండడమే నిదానము.  పరిమితమైన కావ్యప్రయోజనాలకు ఇది సరిపడా విస్తృతము, అనంతముఖము అయిన భాషా ప్రయోజనాలకు అచ్చ తెలుగు చాలదని పూర్వులే గుర్తించారు.  అచ్చ తెలుగు భాషలో ఒక చిన్న కధగాని లేఖగాని వ్రాసినా మనమిప్పుడు అర్ధంచేసుకోలేము. 'ప్రాదెనుగు కమ్మ ' అని గిడుగు రామమూర్తి పంతులుగారు వ్రాసిన రచనయే దీనికి సాక్ష్యము.
                         తంజావూరు యుగము
     విజయనగర పతనానంతరము దక్షిణ భారతదేశంలో అనగా తమిళదేశంలో నాయకరాజుల ఆస్థానాల్లొ తెలుగు సాహిత్యం 17వ శతాబ్దిలో చక్కని ప్రకాశం