పుట:Sahityabashagate022780mbp.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరిచయము

       సహస్తాబ్ధాల్గా ప్రవర్ధమానమగుచున్న తెలుగు సంస్కృతిని తెలుగుదేశపు నలుచరగుల పరిచితము చేయు సంకల్పముతో 1975 వ సంవత్సరమును తెలుగు సాంస్కృతిక సంవత్సరముగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినది.  అందుకు అనుగుణమైన కార్యక్రమాలను నిర్వహింపజేయుటయే గాక, ప్రపంచములోని వివిధ దేశాలలో నివసిస్తున్న తెలుగువారి సాంస్కృతిక ప్రతినిధులందరున్ ఒకచోట సమావేశమగు వసతిని కల్పించుటకై "1975, ఏప్రిల్ 12 (తెలుగు ఉగాది) మొదలుగ ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబార్ న జరుగునటుల ప్రభుత్వము నిర్ణయించినది.  అందుకు ఒక ఆహ్వానసంఘము ఏర్పాటయినది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాన్యశ్రీ జలగం వెంగళరావుగారు ఆ సంఘమునకు అధ్యక్షులు.  విద్యాశాఖా మంత్రి మాన్యశ్రెవె మండలి వెంకట కృష్ణారావుగారు దాని కార్య నిర్వాహణాద్యక్షులు.  ఆర్దికిఅ మంత్రి మాన్యశ్రీ పిడతల రంగారెడ్దిగారు ఆర్ధిక, సంస్థా కార్యక్రమాల సమన్య సంఘాల అధ్యక్షులు.
     ఆ సంఘము, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భమున వచ్చువారికి తెలుగు జాతి సాంస్కృతిక వైభవమును తెలియజేయుటకు అనువుగ ఆంధ్ర భాషా సాహిత్య కళా చరిత్రాదికములను గురించి ఉత్తమములు, ప్రామాణికములునగు కొన్ని లఘుగ్రంధములను ప్రకటించవలెనని సంకల్పించి, ఆ కార్యనిర్వహణకై 44 మంది సభ్యులు కల ఒక విద్వత్ సంఘమును ఆ లఘు గ్రంధముల వస్తువుల నిర్దేశించి వాని రచనకై ఆయా రంగములందు పేరుగన్న ప్రముఖులను రచయితలుగ ఎన్నుకొననిది.  ఈ విదముగ నిర్ధిష్టమైన గ్రంధములలో భాషా, సాహిత్య, చారిత్రిక విషాములకు సంబందించిన వానిని ప్రకటింప తెలుగు మహాసభా కార్యనిర్వాహకాధ్యక్షులు మాన్యశ్రీ మందలి వెంకటకృష్ణారావుగారు అకాడమీని కోరిరి.  మహాసభా సఫలత కొరకై కృషిచేయు సంకల్పముతో ఈ బాద్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో అంగీకరించినది.