పుట:Sahityabashagate022780mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52

   పాకనాటివాడును కమలనాభామాత్యుని పౌత్రుడును అయిన శ్రీనాధుడు మహా విద్వాంసుడు.   జీవిత దృశ్యాన్ని గ్రంధాలనుండి వినుకలిచేట్య కాక యావదంద్ర పర్యటనంచేతా కనుకలిచేత,సూక్ష్మంగా అవగతం చేసుకున్నాడు.  పెద్దలలోపెద్ద, చిన్నలలో చిన్న శృంగార నైషధము, కాశేఖండమువంటి పాషాణ సదృశకావ్యాలూ వ్రాయగలడు.  పల్నాటి వీర చరిత్రవంటి దేశిచ్చందోమయ రచన కూడా చెయ్యగలడు.  ఇంకా చిల్లర మనస్తత్వంకూడా చూపించగలడు.  కవుల్లో అపురూపమయిన సున్నితమైన హాస్యం విసరగలడు.

      "రసికుడు పోవడు పల్నా
       డెనగంగా రంభయైన నేకులె పడకున్
       వసుదేశుడైన దున్నును
       కుసుసూస్త్రుండైన జొన్నకూడే కుడుచున్" చాటువు
    "ముగురంగూర్చిన ముండడైనమునకున్ మోమోట లేదోకదా" భీమ

ఇప్పటి నుంచీ కవులు విషయంకన్న ఆత్మవిశ్వాసము కొంత అహంకృతి బాహాటంగా ప్రదర్శిస్తూంటారు.

   "బ్రహ్మీదత్త వరప్రసాదుడ పురుప్రజ్ఞా విశేషోదయ్యా జిహస్వాంతడ నీశ్వరార్చనకళా శీలుండ వభ్యర్హిత బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్సర్యార్ధ నిర్ధారిత బ్రహ్మాజ్ఞాన కళానిదానమవు నీ బాగ్యంబు సామాన్యమే"
    లన్నాడు కృతిపతి ఈయనను గురించి, బ్రహ్మాండాది పురాణాలు నన్ననార్యుడు కూడా పరిశీలించాడు, "బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరతు" అని భయంతో ఒక విధ్యర్ధి గురువు గారికి నివేదించినట్లు నివేదించుకున్నాడు.  నీయంత వాడు లేడని కృతిపతి చేత చెప్పిందుకొన్నాడు శ్రీనాధుడు.  ప్రబంధ పూర్వయుగం నుంచీ కవుల మన:ప్రవృత్తులలో కలిగిన మర్పే వారి శైలియందు, తదధీనమైన తత్కాల సాహిత్య భాషయందు ప్రత్యక్షమవుతుంది.
     పూర్వమహాకవుల శైలీ విభేదాల్ని తాను చక్కగా ఆకళింపు చేసుకున్నాడని శ్రీనాఢుడు పేర్కొన్నాడు.

     "వచియించు వేములవాడ భీమన భంగి
         ఉద్దండలీల నొక్కొక్కమాటు