పుట:Sahityabashagate022780mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5! మహాకవియని కొందరును, వారికన్న ఒక చూపువాసి అధికుడు కావచ్చునని కొందరును విద్వాంసులు ప్రశంసించారు. పండితలోకంలో అతడట్టివాడే అనుట నిర్వివారము. కాని పాఠక సామాన్యము అతనివైదుష్య స్థాయిని అందుకోవడం కష్ఠసాధ్యము, పద్యశిల్పాన్ని అతడు నిశితంఘా ఉపాసించి అనుష్ఠించాడు. ఉత్తరహరివంశము చిన్న గ్రంధం అవడంచేత వానిలో శిల్పాన్ని ఎంతో తరిమెన పెట్టడం సాధ్యం అయింది. అదే కనుక అష్ఠాదశ పర్వ నిర్వహణ సంభృతమై పేరుపొందు మహాభారతమైతే తిక్కన సోమయాజికి సాధ్యపడని శిల్పనిర్మాణము సోమునికి సాధ్యమవుతుందనుకోవడానికి వీలులేదు. అపారమైన సంస్కృతాంధ్ర వైధుష్యము, గంభీరమై విశృంఖలమైన భావవిహారము, వక్రోక్తినిబిడమైన బాషాకల్పనము, కుప్పలు తిప్పలు తెలుగు సామెతలు ఇవి నాచన సోమన కవితలో కొన్ని స్పుటరేఖలు. ఒక్కొక్క సన్నివేశాన్ని స్థూలంగా అకారచిత్రముగా కాక అంగప్రత్యంగ వర్ణనలతో, ఆయా సందర్భాలను అవసరమైన పరిభాషా పదాల్తో చిత్తజల్లుగా వర్ణించడం ఇతని పద్దతి. పరిమిత విస్తీర్ణంగల కవ్యంలో ఇది సాధ్యము. ఇదే ప్రబంధ రచనకు పురోచన అయింది. సీసపధ్యాన్ని సమ విభక్తాంగములు కల్గునట్టు, తూగుతో, శబ్ధాలంకార ఆవృత్తితో రచించే నేర్పు కవులకు ఈతడు నేర్పినదే అంటారు. వీటిల్లో ఒక్కొక్క పదం ఆరంభమునందో, మధ్యమందో, అతమందో మళ్ళీ మళ్ళీ వచ్చి పాఠకుణ్ణి జోకొట్టినట్తు తట్టుతుంది.

       'అభ్రంకషంబైన యాలపోతునితండు
          పెంచినాడాతడు త్రుంచినాడు ఉ|| హరి||
తిక్కన సోమయాజికి ఈ శిల్పం తెలియనిది లేదు
           'ఎవ్వని వాకిట నిభమద పంకంబు
           రాజభూషణ రజోరాజి నడగు '

ఇట్టి సమాంతర రచనను స్పృశించి విడిచినవారు పూర్వ కవులు. గాఢాలింగన బంధములో చొక్కినవారు ప్రబంధకవులు. నన్నెచోడుడు, నాచన సోముడు, శ్రీనాధుడు, పిల్లమర్రి పిన వీరభద్రుడు, అల్లసానిపెద్దన ఈ క్రమంగా ప్రబంధమాకందము సంవర్ధితమయింది. ప్రబంధ భాషలోని బలదౌర్బల్యాలు నాచన సోముడు అనంతరికులకు సమర్పించిన వారసత్వము. గాధ చింతనముచే సోముని కావ్యంలో కలిగిన సాహిత్యానందము 'లంకమేతకు - నీటి ఈతకు సరి ' యన్న సామెతకు లక్ష్యం అవుతుంది.