పుట:Sahityabashagate022780mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తత్సమ శైలి తెలుగులో రూఢమైపోయించి. శివకవులు కూడ దానిని త్రోసిరాజని అనలేకపోతున్నారు. అయితే వీరుచేసినమేలు ఏమిటంటే సంస్కృతం మీది దురభిమానం చేత తేటతెనుగు శైలిని తృణీకతించకుండా సమసంస్కృతాంద్ర రచన సాగించడానికి గట్టిబాటలు వేశారు. వాదతీవ్రతలో గ్రీర్వాణశైలిని ఖండించినా దానిని బొత్తిగా విడిచిపట్టలేదు.

   తనశైలిని నిత్యవ్యవహారానికి అత్యంత సన్నిహితంగా తేవడానికి సోమనాధుడు పాటించిన కొన్ని మార్పులను గుర్తింపవచ్చును.  ఇవైనా నన్నెచోడునకు అవిదితములు కావు.  అతని మార్గాన్ని విస్తృతపరచి భాషలో గాటంగా స్థాపించడమే పాల్కురికి కవి ప్రశంసనీల్యమైన సేవ ద్రావిడభాషలకు సామాన్యమై, ప్రాచీనకాలమున తెలుగున ఉండిన 'టి ' ధ్వని సోమనాధుని కాలమునకు జనవ్యవహారము నుండి కూడా తోలగి యుంటుంది.  కావున అతడు దానిని పేర్కోలేదు-ల,శ వర్ణముల కభేదమని చెప్పినాడు.  సాధురేఫ శకటరేఫల ఉచ్చారణ (ర, ఱ) శ్రూయమానముగా ఉండేదికావలెను.  అందుచే వీటికభేదము చెప్పలేదు.  యతిప్రాసలయందు వీటి సాంకర్యము అతినికిని సమ్మతము కాదు.  ఆంధ్ర శబ్ధచింతామణి ఈ వర్ణద్వయ సాంకర్యం నిషేధించింది.  'నాన్యేషాం విఅదర్మ్యం లఘ్వలఘానాం, రయోస్తునిత్యంస్వాత్ ' అని ఇచ్చడి వ్యవస్థ. దీర్ఘముమీద నిండుసున్న ఉండదు.  అరసున్న ఉండవలెను. అనునియమము ఆకాలమునలేదు. నిండుసున్నను ఊది పలకడం తేల్చి పలకడం మాత్రం చేసేవారు.  లేఖనమునందు పూర్ణానుస్వారము ఉద్దేశించినచోట దాని యనంతర వర్ణాన్ని ద్విత్వంచేసి వ్రాసేవారు.  కుండ్డ అన్నట్లు వ్రాయవలెను.   నిండుసున్న ఉద్దేశింపబడనిచోట ద్విత్వము వ్రాయరు! 'వాండు '. జనవ్యవహారంలో దీర్ఘంమీద కూడా పూర్ణానుస్వార ఉచ్చారణ కనిపించేది.  శాసన భాషలో ఇది సాధారణస్థితి.  నన్నయ భాషలో అనగా శిష్ఠజన వ్యవాఅరంలో దీర్ఘము మీద పూర్ణానుస్వారము లేకుండడంచేతనే ఆయనదీనిని పరిహరించాడు. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాధుడు జనవ్వవహారం దృష్థిలో ఉందుకొని దీర్ఘంమీద సాధ్యపూర్ణము ప్రదర్శించారు.

         "పాండురాంగం బైనపడతి గర్భమున
          పోండిగా వెలుగుచు టు, త్రుడీక్రియను"
                                                      బసవపురాణము