పుట:Sahityabashagate022780mbp.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆజ్ఞులు, సంసారలంపటులు అని కావచును; శివకవుల్లో కూడ రెండుమూడు ముఖ్య భేదాలు కనబడుతున్నాయి. ఒక తెగవారు సాధారణ శైవులు, శైవము వంకకు మొగ్గు అదికంగా చూపిస్తారు. పరమ మాహేశ్వరులమని చెప్పుకుంటారు. కాకతీయ చక్రవర్తులు వారి అనుయాయులు ఇటువంటి వారు. వీరు విష్ణువును నిరసించరు. వేదమతాన్ని కాదనరు. ఈ పరమ మాహేశ్వర బిరుదము కాకతీయులకు చాలా పూర్వమే ఉండింది. గుణగవిజయాదిత్యుని సేనాని పండరంగు పరమకాహేశ్వరుడని అతనికి అద్దంకి శాసనం ప్రకటిస్తూంది. శైవుల్లో రెండవరకం వారు శివనిష్ఠనే పాటిస్తారు. విష్ణువు మహేశ్వరుని పరివార దైవముల్లో ఒకణ్ణిగా మాత్రమే ఒప్పుకుంటారు. చాతుర్వర్ణ్యవ్యవస్థను అంగీకరిస్తారు. ఇంక మూడవ తెగవారు వీర శైవులు, వీరు శివ్ససారమ్యమునే పరిగణిస్తారు..వేద ప్రామాణ్యాన్ని, వర్ణాశ్రమ ఆచారాల్ని ఖండిస్తారు. రెండు, మూడు తెగల శైవులనే మనం శివకవులంటాము. వీరు తెలుగు సాహిత్యంలో ఇతివృత్తం విషయంలోనూ, భాష విషయంలోనూ కూడా అపూర్ఫ విప్లవం తేవాలని జెండాయెత్తి, కొంత కృషి చేసి, స్వల్ప విజయం సాధించారు. ఈ స్వందర్బంలొ వీరు క్రొత్త సంకేతాలు ప్రవేశపెట్టారు. దేశి-మార్గ అనే పదాల్ని కవిత్వరంగంలోకి దింపారు. ఈ మాటలు ఎక్కువగా సంగీత శాస్త్రంలో ప్రమేయం కలిగి ఉన్నాయని తజ్ఞులు చెప్పుతున్నారు. శాస్త్ర బద్దమైన సంగీతాన్ని మార్గమనీ, దానికి భిన్నమై ప్రజాసామాన్యంలో కనబడే దానిని దేశ అని అక్కడ వ్యవహరించారు. వాల్మీకి నాడే ఈ భేదము గుర్తింపబడింది. లవకుశులు రామాయణాన్ని మార్గ సంగీతంతో గానం చేసినట్లు ఆ మహర్షి ప్రశంసించాడు. 'ఆగాయతాం మార్గ విధాన సంపదా ' మార్గ విధానం ఉన్నప్పుడు దేశవిధానం కూడా ఉండేదని ఒప్పుకోవాలి. ప్రాచీనమైన ఈ భేదాన్ని శివకవులు తెలుగులో ప్రవేశపెట్టడానికి పూనుకున్నారు. ఇత్రివృత్తంలోనూ కూడా దేశ మహత్యాన్ని ప్రతిష్ఠించాలని వీరు తలపెట్టడం ప్రశంసాప్రాత్రంలాగానే ఉంది. ఆదరణలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

    మొట్టమొదట ఈ క్రొత్త సంకేత పదాల్ని మనకు పరిచయం చేసినవాడు  నన్నెచోడకవి.  కుమార సంభవ కృతిపతి.  ఈయన కాలం విషయంలో ఎంతో చర్చ జరిగి ఈ కవి  నన్నయ తిక్క నలకు నడిమి వాడని అత్యధిక సంఖ్యాకులైన విమర్శకులు భావిస్తున్నారు.  ఇతడు నన్నయ కంటె ప్రాచీనుడని కొందరు తలిచారు.  నన్నెచోడుడు సుకవిస్తుతిలో ఉత్తమమార్గ సత్కవీశ్వరులను దేశి సత్కవులను ఉభయుల్నీ సంభావించాడు.  కాని ఆ మార్గ సత్కవీశ్వరులెవరో దేశి సత్కవులెవరో ఒక్క పేరు