పుట:Sahityabashagate022780mbp.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కర్ణాటకుల ఆధిపత్యాన్ని అంగీకరించవలసి వచ్చిందని వారి ప్రతినిధిగానే నరాయణ భట్టు వేగి దేశానికి వచ్చాడని చారిత్రకులు చెప్పుతున్నారు. వీరిమూలంగా ఆంధ్ర భషకు కన్నడ సంబంధం తప్పక ఏర్పడి ఉంటుంది. ఇంత అయినప్పటికీ నన్నయ రాజరాజులు తమ ఆంధ్రదేశాభిమానాన్ని, ఆంధ్ర భాషాభిమానాన్ని వదులుకోక తెలుగులొ స్వతంత్ర సారస్వత సృష్టికి బద్దకంకణులయ్యారు. ఇతర భాషా కావ్యాల్ని వీరు విడివిడిగా వాటిలో ఉండే గుణాలచేత ఆకృష్ణులై ఆ గుణాలను తెలుగు వాజ్మయంలోకి పవేశపెట్టడానికి, వెనుతీయలేదు. ఆంధ్రమహాభారత భాషను కల్పించుకోవడంలో నన్నయభట్టు కన్నడ మహాకవుల మార్గాలను ఆకళించుకొని స్వంతం చేసుకొన్నాడని తజ్జులు అంటున్నారు. విజ్జులు తమ వ్యక్తిత్వాన్ని త్యాగం చెయ్యకుండా గుణం ఎక్కడ కనబడినా దాన్నిగ్రహిస్తూనే ఉంటారు.

    ఆంధ్ర శబ్ద చింతామణి ఉద్దేశించిన సజ్జనులలో ఇద్దరిని గుర్తుపట్టారు.  వారు నన్నయ రాజరాజులు.  ఈ విధంగా స్వదేశ స్వభాషాభిమానంతో దీపిస్తూన్న సజ్జనులు ఇంకా చాలామంది ఉన్నట్లు నన్నయభట్టారకుడు తెల్పుతున్నాడు.  వీరి నాతడు 'సత్సభాంతరములు ' అని నిర్దేశించాడు.  ప్రత్యేకంగా వారికొక  పద్యంలో స్తుతించాడు.

      "పరమ వివేక పౌరభనిభాసిత సద్గుణపుంజ వారిజో
      త్కర రుచిరంబులై సకల గమ్య సుతీర్ధములై మహామనో
      హర సుచరిత్ర పాపన పయ: పరిపూర్ణులైన సత్వభాం
      తర సరసీవనంబుల ముదం బొసరంగొనియాడి వేడుకన్ ఊ-1-24

    ఈ స్సత్సభాంతరములు ఆనాటి విద్వత్పరిషత్తులని భావించవలెను.  వీరుకాక రాజరాజ నరేంద్రుని సభలో బహుశాస్త్ర పారంగతులైన విద్వాంసులున్నారు.  'దేవానీయ నుమతంబ్య్లను వివజ్జనంబుల యనుగ్రఃహంబునంజేసి నా నేర్చిన విధంబున నిక్కావ్యంబు రచియించెదను ' అన్నాడు భట్టారకుడు.  వీరిలో కొందరు దేశభాషలో భారతము వంటి మహాగ్రంధము రచించుటను వ్యతిరేకించిన వారును ఉన్నట్లున్నారు.  దీనిని కూడ కవియే సూచించియున్నాడు.

       'పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నా
       రాయణునట్లు వాసిగ ధరామర వంశ విభూషణుండు నా
       రాయణభట్టు వాజ్మయ దురందరుడుం దనకిప్పుడున్ సహా
       ధ్యాయుడువిఅనవా డభిమతస్థితి తోడయి నిర్వహింపగన్ ' ఆది-1-25