పుట:Sahityabashagate022780mbp.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తరుచు అలంకార భూషితంగా ఉండాలనే ఆయన మతముగా తోస్తుంది. అయినా బలాత్కారంగా సందర్భంరహితంగా అలంకారాలు చొప్పించకూడదనేది ఈయన హృదయంగా కనిపిస్తుంది. ఈ మతాన్నే ఆంధ్రశబ్ధ చింతామణి కూడా ఈషద్బేదంతో ప్రవచించింది. నన్నయ ప్రసక్తిలో ఆంధ్రశబ్ద చింతామణి ప్రసంగ మెందుకు అని ప్రశ్న వస్తుంది. ఈగ్రంధం నన్నయ కృతమని కాదని వాదోపవాదాలు ఉన్నాయి. అది యెట్లయినా ఈ వ్యాకరణ గ్రంధము ప్రాచీనుల అభిప్రాయాలను చాలా సన్నిహితంగా ఉండడం చేత దానిని మనం పరిగణిస్తున్నాము. కావ్య నిర్మాణంలో రససిద్ధియే ముఖ్యమని, కవులు యావచ్చక్తులు వినియోగించి కావ్యాన్ని రసవంతంగా చెయ్యాలని ఈ గ్రంధం ఉద్బోధించించి. 'నానా గ్యారసవృత్తి: ! సాధ్యోహిరసోయధాయధం కవిలి! || ఇది చాలా ప్రశంసనీయంగా ఉంది. అ కాలపు పెద్దల అభిరుచులెట్లాఉండేవో చింతామణి సూచిస్తుంది. 'స్వస్థాన వేషభాషాబి మతస్సంతోరనప్రలుబ్దధియు: లోకే బహ్మన్యంతే వైకృత కావ్యాని చాన్యదపహాయ ' సజ్జనులు స్వదేశమునందును స్వవేషమునందును స్వభాషయందును అత్యంత ప్రీతిగలవారై ఇతర దేశవేషములను ఇతర భాషలను విడిచి రసలుబ్దులై ఆంధ్ర కావ్యములను సబహుమానముగా ఆదరించుచున్నారు. నన్నయభట్టు ఈ సజ్జన కొటిలోని వాదేకదా. ఆయన స్వదేశాభిమానాన్ని మూలభారతంలో లేకపోయినా ఆంధ్ర మహాభారతం ఆది-8-139 'దక్షిణ గంగనాదద్దయ నొప్పిన ' అనే పద్యంలో ప్రకటించుకొన్నాడు. ఆంధ్రదేశౌనదియైన గోదావరిని, పుణ్యక్షేత్రములైన భీమేశ్వర శ్రీశైలమ్లను కర్మభూమియైన వేఘీదేశాన్ని ఎట్లో ప్రసక్తి కలిగించుకొని వర్ణించాడు. ఆయన స్వభాషాభిమానానికి ఆంధ్ర మహాభారతమే శాశ్వత సాక్ష్యము. ఆంధ్ర సజ్జనులు తెలుగు కావ్యాలనేకాక సంస్కృత భాషా కావ్యాలనుకూడా ఆదరిస్తారని శ్లోకంలోని 'చ ' అనె ' సముచ్చయం సూచిస్తూందని అహోబలపతి వ్యాఖ్యానించాడు. ఇది యుక్తముగానే ఉంది. అన్యదపహాయ-ఇతరములైనవి విడిచి-అన్నప్పుడు ఆ ఇతరములేమై ఉంటాయి. ప్రాకృత కావ్యూములు కావచ్చును. తమిళ కన్నడ కావ్యాలు కూడా కావచ్చును. ఎందుచేతనంటే చారిత్రకంగా తమిళులు, కన్నడులు రాజరాజనరేంద్రుని తల్లి కుందబాంబ తమిళ చక్రవర్తికూతురు. రాజరాజ నరేంద్రుని భార్య అమ్మంగదేవి తమిళరాజు కుమార్తె. ఈ సంబందాల చేత ద్రావిడజన, ద్రావిడ భాషా ప్రభావాలు అంధ్రదేశం మీదపడి ఉంటాయి. ఇంక కన్నడ దేశాన్ని పాలిస్తున్న పశ్చిమ చాళుక్యులు వేంగి దేశంపై తరుచు దాడులు చేస్తూ రాజరాజుకు అలజది కలిగించెవారు. రాజరాజనరేంద్రుని రాజ్యాంత కాలంలోఈతడు