పుట:Sahityabashagate022780mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నన్నయ - సాహిత్య భాష

      "అరిదగునట్టి యెఱ్ఱ నృపునంగన గామమసాని యెక్కమే
       ల్గరుదని చేతభూవిభుని గాకతి
       వల్లభు చిన్నవానిరా!
       బరగగ జేతలబట్టి ఘను జల్గవరాయని యో నిజబ్జభా
       స్కరనిధు చక్రవర్తి గని కాకతినిల్పుట గోటి సేయదే"

ఈ శాసనమునందలి కొన్ని దేశ్యపదముల యర్ధము సులభ గ్రాహ్యముగాలేదు. అయినను చక్కని నడకగలిగి వృత్త రచనయందు కవుల ఆరితేరిన సన్నివేశమును నన్నయకు ముందే తెలుగు సాహిత్యరంగంలో అవతరించిన స్థితి చూసినాము.

నన్నయ - సాహిత్య భాష

 ఇటువంటి  పూర్వరంగంలో నన్నయభట్టు మహా సాహిత్య సృష్టికి పూనుకొన్నాడు.  సాహిత్య బాష విషయంలో పూర్వులు అభిప్రాయాలు కొంతవరకైనా ఊహించవచ్చును.

1.సాహిత్యభాష ఉదాత్తంగా ఉండాలి. వారు సృష్టింపదలచిన ఉదాత్తసాహిత్యానికి8

 అనుగుణంగా ఉండాలి.

2. అది దోషరహితంగా ఉండాలి. సామాన్య వ్యవహారానికి భిన్నంగా ఉండాలి

3. సాహిత్య భాష అలంకృతమై యుండాలి.

        ఈ భావాన్నే ఆంధ్రశబ్ద చింతామణి ఇట్లా ప్రకటించింది.  'తరదోషౌ, పరికృతౌచ వాగర్దౌ ' విశ్వశ్రేయ:కావ్యం -కావ్యము సమస్త శ్రేయస్సులను ఇచ్చునది.  ఆ శ్రేయస్సులివి: యశస్సు, అర్ధలాభము, అమంగళకాంతి, అలౌకికానందము, ఉపదేశ ప్రదాయిత్వము.  కావ్యము లోకహితం కొరకు అని  ఆధునికులు దీనిని అవ్యయిస్తున్నారు.  అది కూడా గ్రాహ్యంగానె ఉంది.  అట్టిలోకహిత ప్రయోజనం కల కావ్యము దోషరహితము, అలంకార సహితము అయిఉండాలని ప్రాసీనుల మతము.  ఈ నిర్వచనము సంస్కృతాలంకారిక నిర్వచనాలకి అనుగుణంగా ఉంది.  కావ్య ప్రకాశికా కారుడైన మమ్మటుడు చెప్పాడు:"ఆదోషములు, గుణసహితములు, ఎక్కడేనా అలంకార రహితములు అగుశబ్దార్ధాలు కావ్యము", ఎక్కడేనా అలంకార రహితము అని చెప్పడం చేత