పుట:Sahityabashagate022780mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇయ్యెట్టు ఇన్నెలపుసంటివికలవు. అవధారణార్ధమునందు నన్నయ అకారము వాడుచుండును. నీవే అని మనమిప్పుడు అంచోట పూర్వులు నెవ అనెడివారు. శాసనము లోని ఇన్నెలవ (ఈ స్థలమే) ఇట్టిది. రాజు పట్టంబుగట్టిన పతి అను మిశ్రస్సమాసం చక్కఘా కూర్చబడింది. కర్మాదులకు ప్రాధాన్య విపక్షయందు ధాతుజ విశేషణంబులు కర్తతోడంబోలె వారితోడ సమసిందు అని చిన్నయసూరి చేసిన వ్యవస్థకు ఉదాహరణము కాదగియున్నది. ఇక్కడ కర్తృప్రాధాన్యమేతోస్తూంది. ఆశ్వమేధంబునఫలము, లింగం బఱిసిన పాపము అను చోటులందు ఆగు ధారువులెకుండగనే అన్యయమగు చున్నది. ఇదియే తెలుగు పద్ధతి. నన్నయ అగు ధాతువుచేర్చి సమాపకక్రియాసిద్దిని సాధిస్తాడు. ఇన్ని భాషా విశేషాలు, చందోవిశేషాలు నన్నయకు పూర్వమే వాడుకలో నికివచ్చి ఉత్తమ సాహిత్యనిర్మాణానికి పునాదులు అయాయి.

    ఇంతవరకు చూసిన శాసన సాక్ష్యం పూర్వాంధ్రమునక్ చెందినది.  తెలంగాణమునందును పద్య చ్చందస్సులు కొన్ని యెడల తోచుచున్నవి.  కరీంనగరము, నిజామాబాదు మండములలో వేములవాడ చాళుక్య వంశీయుడైన రెండవ అరికేసరికి (క్రీ.శ.945) అంకిత మిచ్చినాడు.  పంపక వియనుజుడైన జనవల్లభుడనునాతడు ఇచ్చిన గంగాధర శిలాశాసనంలో మూడు తెలుగు కంద పద్యాలు లభించడం విశేషము.  మాచ్చుకు ఒక పద్యము.

         "జినభవనము లెత్తించుట
         జినపూజల్సేయు చున్కి జినమునులకు న
         త్తినయన్న దానమవుట
         జినవల్లభు బోలగలదే జినధర్మపరుల్"

ఈ కందములందు కొన్ని చిన్నచిన్న లోపములున్నను నన్నయకు ముందే కందపద్య రచన కూడ ప్రచారంలోకి వచ్చినదనుట సత్యము. జనగామ తాలూకా గూడూరు గ్రామమునందు లభించిన విరియాల వంశము వారి శాసనంలో మూడు చంపకమాలలు రెండు ఉత్పలమాలా పద్యములు వ్రాయబడినాయి. ఈ శాసనకాలము క్రీ.శ. 1000 సంవత్సర ప్రాంతమని పరిగణిస్తున్నారు. కాకతి మొదటి బేతరాజు ప్రశంస దీనిలో కన్పిందును. ఇందలి ఒక పద్యము