పుట:Sahityabashagate022780mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంగును ఈ ధర్మనిర్వాహణోద్వోగమునకు బృహస్పతి సమానుండైన పెర్గడ కడెయ గారి కొడుకు బెజెయరాజు సమర్ధుడని ఆత్మానుమతంబుసంబంచిన '

   దీనిలోఫ్ సంస్కృతాంద్రములను చక్కగా మేళవించి సంస్కృ సమాస భరితంగా తత్సమశైలిలో గద్యనదిపించడం కనబడుతుంది.  అనగా నన్నయకు ఇంచుమించు నూటఏబది సంవత్సరములకు ముందే ఆయన మెచ్చుకోదగిన వచన రచనా పద్దతి వాడుకలోనికి వచ్చినదని చెప్పవచ్చును.
    పద్యరచనా మార్గమునందు యుద్దమల్లుని బెజవాడ శాసనాన్ని రెండవ మైలు రాయిగా అనుకోవచ్చును.  సాహిత్య వికాస చర్చయందు నీరసమ్లైన ఈ శాసనాలు ప్రసంగం ఎందుకు అనే సందేహం తోచవచ్చును.  నిజమే. ఇవి ప్రత్యక్షంగా సాహిత్యోదాహరణాలు కాజాలవు.  పరోక్షంగా మాత్రం ఇవి పరిగణించదగి ఉన్నాయి.  సాహిత్యానికి ముడిసరుకులైన భాష, చందస్సు వీటీల్లో పరిమాణరూపంలొ మనకు కనబడుతున్నాయి.  ఈ శాసనాలు కూడా బొత్తిగా రసవిహీనాలు అనడం న్యాయంకాదు.
    ఇవి సాధారణంగా ధర్మోద్దేశంతో వెడలినవి గనుక వీటిల్లో ధర్మవీరం చూడవచ్చును.  పందరంగని శాసనంలో అతని యుద్ధ విజయాలు ప్రశంసింపబడ్డాయి కనుక దానిలో యుద్దవీరం చూడవచ్చును ప్రకృతమైన బెజవాడ శాసనము, ఇది రెండవ యుద్దమల్లుడను రాజు కాలమునాటిది.  కావున క్రీ.శ. 927-34 నడికాలమున చెక్కబడియుండును.  ఇది నన్నయ భట్టారకునికి సరిగా ఒక శరాబ్దము వెనుక శాసన విషయము ఏమన యుద్దమల్లుడు కుమారస్వామికి బెజవాడలో గుడియుమఠమును కట్టించెను.  ఈ మఠంలో గౌరగలు అనగా శివభక్తులు కానివారు నివసింపకూడదు.  శైవేతరులు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే ఊరి పెద్దలున్నూ ప్రభువైన రాజున్నూ వారిని వెళ్ళగొట్టవలెను.  ఈ మొదలైన అంశాలు ఉన్నాయి.  ఈ శాసనము మధ్యాక్కర చందస్సులో వ్రాయనైనది.  ఇదికూడా దేశీయ వృత్తమే ఉదాహరణకు రెండు పద్యాలు

       వెలయంగనియెట్టు బస్సిమలినురై విడిసినబ్రోల
       గల తానపతులును రాజు పట్టంబు, గట్టిన పతియు
       నలియబైవారల వెలరించిన యశ్వచ్రేదంబు
       ఫలము పేక్షించిన లింగమఱిసిన పాపంబు దమకు"