పుట:Sahityabashagate022780mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డలకార సంయుక్త రూపం కనబడుతుంది. డ్లు వర్ణాంతర రూపాలు-గుడి-గుడ్డు, మడి-మడ్లు వంటివి. ప్రాచీన భాషలో తరచుకనబడతాయి. ఇప్పుడు మనం వర్ణ సమీకరణం చేసి-అళ్ళు (దాన్యము) గుళ్ళు ఈ విధంగా వాడుతున్నాము. నన్నయలోఫ్ కూడ డ్లు వర్ణాంత రూపాలులేవు. దమ్మువులు-ధర్మశబ్ద భవము. నన్నయ కూడ దర్ముపులు అని వాడినాడు. అశ్వమేధంబు ఫలంబు అన్నచోట నన్నయ రచన గుర్తుకు వస్తుంది. యోగ క్షేమంబున తెఱగు. షష్టీ సమాసమున నాగగమము. ప్రాకృత భాషా ప్రభావం కొంత కనబడుతుంది. దమ్మపురంబున-ధర్మపురమున అనుటకు. ఇందలి తరువోఱ పద్యము ఎగుడు దిగుడులు లేకుండ సమరీతినే సాగిపోయినది. ఈ విధమైన పద్య రచన ఎగుదు దిగుడులు లేకుండ్ సమరీతినే సాగిపోయినది. ఈ విధమైన పద్యరచన ప్రచారము లోనికి రావడానికి అంతకుముందే ఒక శతాబ్దమో దానికి మించియో పూర్వము పద్యరచన తెనుగులో అవతరించి ఉండాలని ఊహించగలము.

   గునగవిజయాదిత్యుని కాలంలోనే వెలసిన కందుకూరు శాసనంలో సీస పద్యం అస్పష్టంగా కనబడు తూంది.

       శ్రీ నిరవద్యుండు-చిత్తజాతనముండు
       శివపదపరభక్త సేవితుండ భిలుండు

   మొదటి చాళుక్య భీమరాజు ధర్మవరం శాసనంలో కూడా సీసపద్య భాగం కనబడుతూంది.

   ఎడరిన బోయం నడవి సొనిపె
   లోహాసనం బెక్కిదాహను నొడిచిన
   వల్లభు కొల్పున నెల్గనెఱుగ
   వణ్ణరంగు చూచె వణ్ణరంగు

    దీనిలో ప్రాసయతి నియమమూ, పద్యాంతమున ఆటవలది వ్రాయుట చూద నగును.
  ఈ కాలపు ధర్మవర శాసనంలో నన్నయభట్టారకుడొక్కక్కప్పుడు రచించు ఉన్నత సంస్కృత రీతి రచన ప్రత్యక్షమవుతుంది.  శాసనం చివర 'గద్య ' అనేపదం వాడబడడం చేత ఈ రీతి రచనను అప్పటి విద్వాంసులు గద్యగా పరిగణించిరేమో అను ఊహ పొడముతూంది.
    'విజయాదిత్యపాద పద్మపాద పద్మభ్రమరాయమాన శ్రీమత్కడెయరాజు, గుణఘానాభరణుండు దనకేని ఈశ్వరౌనకుం గార్తికేయుండుంబోలె ..... గరణమ్మున పండ