పుట:Sahityabashagate022780mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రూపాంతరనబు భావించబడింది. ధ్వంసము చేయడం, పాడుచేయుట అని దీనిహర్థము. ప్రాచీనమైన ట ధ్వని డ, ర, ళ వర్ణాలుగా మారించని ఇదివరలో చెప్పియున్నాము., దెందులూరు-ళెందులూరు ఈ క్రమంలో మొత్తంమీద చిలంకొరు శాసనం భాషా ప్రగతిలో కొంతముందుకు నడిచినట్లే కనబడుతుంది.

     క్రీ.శ. 9 శతాబ్ది మధ్య వెడలిన పండరంగుని అద్దంకి శాసనం తెలుగు భాషను సాహిత్యాభిముఖంగా ముందుకు నడిపిస్తూంది.  పండరంగడు తూర్పు చాళుక్య ప్రభువు గణగవిజయాదిత్యుని8 (క్రీ.శ. 848-92) సేనాని. ప్రభువుచే నియుక్తుడై ఇతడురాజ్య దక్షిణ భాగంలో విజయాలు సాదించి అద్దంకిలో శాసనం ప్రకటించాడు. ఈ శాసనంలో మొదటిమాట తెలుగు పద్యరచన ఆవిర్బవించింది.  గద్యవనం లోంచి పద్యారామం లోకి అడుగుపెట్టినట్లయింది.  అద్దంకి శాసనంలోని పద్యము తరువోజ అనిగుర్తించారు.

భూపాలుండు
పట్టంబు గట్టిన ప్రధమంబునేణ్దు, బలగర్వమెప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బందరంగు, బంచిన సామంత పడువతొబోయ్
కొట్టముల్ పండ్రెండు గొనివేంగినాంటి
గొఱ్పియ త్రిభువనాంకుశ బాణ నిల్పి
కట్టెపు దుర్గంబుగడుబయల్ సేసి ' కందుకూర్బెజవాడ గావించెమిచ్చి

   పండిరంగు పరమ మాహెశ్వరుణ్ణు ఆదిత్య భటారనికి ఇచ్చిన భూమి ఎనుబొది పుడ్ల అడ్లు ప్;అట్టునేల, రమ్మవరంబున దమ్మువులు వీని రక్షించిన వారికి అశ్వమేధంబు ఫలంబగు"
    ఈ శాసనములోని చారిత్రకాంశాలు విశదంగానే ఉన్నాయి.  భాషా విషయంగా ఇది అత్యంత ప్రాముఖ్యం వహిస్తూంది.  మొదటిది దీనిలో పద్యము గద్యము ఉండి నన్నయ పాటించిన చంపూ కావ్య పద్దతికి నాందిగా కనబడుతూంది.  రెండఫరి దేశీయ చ్చందమైన తరువోజలో ఉండుట. ఇది రెందు ద్విపద వాదాలకూడికచే ఏర్పడుతూంది.  అనంతర కాలంలో అనగా శివకవుల యుగంలో ద్విపదకు ప్రత్యేక స్థానం లభించించి.  కొట్టముల్ పండ్రెందు అన్నప్పుడు ప్రధమ మీద గసడదవా దేశ కార్యం జరిగింది.  కొఱల్పు-దహించు అను పూర్వక్రియ వాడబడింది.  ఆదిత్య భట్టారునకు భూమి ఇచ్చెను అనుటకు బదులు ఇచ్చిన భూమిఅని క్రియాజన్య విశేషణ పూర్వకర్మ దారయ సమాసం చెయ్యబడింది. ఎనుబొది వుడ్ల(ట్ల) అడ్లు పట్టు నేల అన్నప్పుడు