పుట:Sahityabashagate022780mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దాయం ప్రకారం వరుషవైన 'ఉ ' ఉండాలి, దీనికి నిదర్శనం ఏమిటంటే దీనిమీద అన్నంత శబ్దంచేసేటప్పుడు 'కాన్ ' అనియే అవుతుంది. ఇది మురిపెమైన చిన్న శాసనం. మనకాలౌ భాషకు చాలా చాలాదూరంగానూ, నన్నయ భాషకు కొంచెం సమీపంగాను, ఉన్నది.

  ఆరవ శతాబ్ధం నాటిది నెల్లూరు జిల్లా భైరవుని కొండవద్ద దొరికిన ఒక శాసనం. ఒక్కటే వాక్య్హం ఉంది.

శ్రీ వేలు గుణ్ణ ఆచార్లు ఫణికెసిరి!

   వేలుగుంట ఆచార్యులు పనిచేసిరి, ఆచార్లు వ్యావహారిక రూపం, ఇప్పటికీ వాడుతున్నాము.  పని అని దంత్యనకారంతో వ్రాయవలసినది మూర్ధన్యనకారంతో వ్రాశారు.  అన్నిటికిమించి ఆశ్చర్యకరమైనది చేసిరి అనుటకు జెసిరి. ఇది చెక్కడంళొ పొరపాటు కూడా కాదు.  ప్రాచీన కాలంలో శబ్దాలు ఎక్కువగా కంఠ్యాదిగా ఉండేవి.  తరువాత అని తాలవ్యములుగా మారాయి.  క-చగా మారించి.   దీనినే తాలవ్యీకరణం అంటారు.  భాషలో రెండవదశ అకు-అగు అవడంపైన చూశాము.  ఒక్కొక్కప్పుడు కంఠ్యములు సరళములవుతాయి.  కడప-గడప.
    ప్రాచీభాషా పరిణామం తెలియడానికి మైలుగాళ్లల్లా అక్కడక్కడ ఒక్కొక్క శాసనం చూద్దాము.  క్రీ.శ. 8వ శరాబ్దినాటిది అని భావింపబడిన చిలంకూరు శాసనం, కడప జిల్లా.
     "స్వస్తిశ్రీమత్ విక్రమాదిత్య చోళమహారాజుల ఏలన్ చోళమాఅదేవుళ్ ఉత్తమాదిత్య సామంతకముళ్ చిఱుంబూరు ఏలన్ ఊరయేలపాఱ్ల పాకాటిళూనఫణం (ప)రియారము మదుతుణ్ణు ప్రసాదచేసిరి.  ఆచంద్రార్కంబు నిల్వ - తొల్పకొమి రట్టగుళ్ళ చోళిఅరట్టగుళ్లు, అతిశయ రట్టగుళ్లు ఆశికో - రిక్కి ప్రసాద పూర్వము - తేనిళచ్చు - (మ)హాపాతక---."
      విక్రమాదిత్య చోళమహారాజులు ఏలుచుండగా చోళమహాదేవియు, ఉత్తమాదిత్యుడు సామంతులుగా చిఱుంబూరునందు పరిపాలించగా, గ్రామమునందలి ఏడుగురు బ్రాహ్మణులకు పాకటూలుసవణం (పన్ను) పరిహారమున్నూ, మఱుతు (నేల) యున్నూ ప్రస్దాదంచేసిరి.  ఆచంద్రార్కము నిల్చనట్లుగా, తొల్పకామి రట్టగుళ్ళు, చోళియరట్టగుళ్ళు.  అతిశయరట్టగుళ్ళు - ప్రసాదపూర్వము.  దేనికి విఘ్నముచేసి(నవారు) మహాపాతకులగుదురు.