పుట:Sahityabashagate022780mbp.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులో సాహిత్య భాషావతరణము

  'కాంతా సమ్మితాయా యయా సరసతా
  మాపాద్య కావ్యశ్రియా కర్తవ్యే కుతుకీ బురో విరచితన్తస్త్య స్సృహోం కుర్మహే"

  అంటే కాంతా సమ్మితమైన కవ్యోపదేశం చేత సజ్జనుడు కర్తవ్య్హము నందు ఉత్సాహం కల వాడుగా చేయబడుతున్నాడు.  అట్టి కావ్యశ్రీకి నమస్కారము. సాంఘిక సమసలను, సాంఘిక అన్యాయాలను, అసమానతలను, పీడనలను అన్నింటినీ కవిత్వంలో చర్చించ వలసే ఉంటుంది.  అవి కావ్య వస్తువు కావచ్చును.  ప్రాచీన గ్రీకు అలంకారికులు భావించినట్లు 'To purge felings through pity and fear' కవిత్వము కరుణ, భయానక రసముల ద్వారా భావ సంశుద్ధిని కలిగించవలెను.  మానవుని భావములన్ సంశుద్ధము చేయవలెనే  కాని అతని అసంస్కృత రాగ ద్వేషాలను రెచ్చగొట్ట కూడదు.  ఏ కావ్యము పాఠకుని యందు భావ సంశుద్ధిని, సమస్తజీవుల యెడ దయా స్వభావమును (కరుణ) పాపము విషయములో భీతిని (fear) కలిగించదో అది కవిత్వ ధర్మంలో విఫలమయిందన్నమాట.
     పై చర్చ చేత కావ్యమునందలి భావం భాషకూడ పాఠకుణ్ణి ఉన్నత శ్రేణికి కొనిపోవునవిగా ఉందవలేనని తేలుతున్నది.  భాషా విషయంలో కవితా శిల్పానికి వెలికాకుండా పాఠకునకు  ఎంత సన్నిహితంగా పోనగునో అంత సన్నిహితంగా పోవుటయే ప్రాచీనుల లక్ష్యం, పాఠకునియంది కవి వెంటపోవుటకు కొంత ప్రయత్నము కావలెను. కవి తన మట్టానికి దిగాలని పట్టుపట్టకూడరు.  ఆ ప్రయత్నం కవి పాఠకుల కిరువురకును లాభదాయకం కాదు.  అటువంటి ఉద్యమంలో ఉత్తమ కవిత్వం ఆవిర్బ వింపనేరదు.  ఈ పూర్వ రంగంతో సాహిత్య భాషగా తెలుగు ఎట్లు తీర్చి దిద్ద బడిందో అది తన లక్ష్యాన్ని ఎంత వరక్ నెరవేర్చగలిందో పరిశీలిద్దాము.

తెలుగులో సాహిత్య భాషావతరణము

తెలుగులో సాహిత్య్హం ఎప్పుడవతరించిందో అప్పుడే సాహిత్య భాష కూడా అవతరించిందని స్థూలంగా చెప్పవచ్చును. ఏ భాష విషయంలోనయినా అంతే, ఇప్పుడు మనకి తెలిసినంత వరకూ నన్నయ భట్టారకుని ఆంధ్ర మహాభారతమే తెలుగులో గల తొలి గ్రంధము. కవిజనాశ్రయ మనే చందో గ్రంధమూ, నన్నెచోడుని కుమరసంభవ కావ్యమూ నన్నయ్యకు ముందే వెలిశాయని కొందరు విమర్శకులు భావిస్తారు. కాని అత్యధిక సంఖ్యాకులైన మన సాహితీ వేత్తలు దీనిని ఆమోదించడం లేదు. ఇప్ప