పుట:Sahityabashagate022780mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇవి లక్ష్యము - సాహిత్య భాష

       "జలధివిలోలవీచి విలసత్కల కాంచి సమంచితావనీ
        తల అహన క్షమం బయిన దక్షిణహస్తమున్ం దదున్నను
        ద్గళదురుఘర్మ వారికణ కమ్రకరాబ్జము వట్టి నూతిలో
        వెలువ్చడ గోమలిం దిగిచె విశ్రుతకీర్తి యయాతి ప్రీతితోన్"
అని నన్నయ భట్టారకుడును.
       "సింగంబాకటితో, గుహాంతరమునన్ జేడ్పాడు మైనుండిమా!
        మాతంగస్పూర్జితయాదదర్శన సముద్యత్ క్రోధమై వచునో!
        జంగాంతార నివాస భిన్నమతినస్మత్సేనపై వీడే న!
        చ్చెంగుంతీ సుత మధ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్
అని తిక్కన సోమయాజియు.

లలితస్కంధము కృష్ణమూలము ' ఇత్యాధిగా బమ్మెరపోతరాజు గారును వ్రాసి నప్పుడు ప్రజాసామాన్యానికి ఇది అర్ధ్యమయి ఉంటుందా! ఏదో మసిపూసి మారేడుకాయ చ్?ఏసినట్టున్నది, అనవచ్చును కొందరు దీనిలో మోసగింపు ఏమీలేదు. కాని కవిత్వపు పరమార్దము, రహస్యము దీనిలో వ్యగ్యంగా ఇమిడి ఉన్నాయి. కవిత్వము యొక్క అరమర్ధము ఏమని చెప్పుకొన్నాము. సహృదయుణ్ణి భౌతిక వాసనలనుండి సుకారంగం లేవనెత్తి రసబ్రహాభి ముఖంగా పయనించేటట్లు చెయ్యడమని చెప్పినాము. ఈ రసమూ, |బ్రహ్మమూ, లేవనెత్తడమూ ఇదంతా బూర్జువావాదము అని త్రోసిపుచ్చే వారితో మనము విదించుటలేదు. ఉచితసమయంలో వారి అరిభాషలోన్నేవారికి నివేదించుటకు యత్నం చేద్దాము. రసాభిముఖంగా పాఠకుణ్ణి తీసుకువెళ్ళేటప్పుడు రసానుకూలమైన రచన ఉండాలని సాహిత్య శిల్పవేత్తలు నాడూ నేడూ కూడా భావిస్తున్నారు. అందుచేత భాషా వైవిధ్యం ఏర్పడుతుంది. రెండవ ముఖ్య విషయం ఏమిటంటే, ఏకాలపు కవిత్వమైనా సరే- కవి పాఠకునితో పాటు క్రిందికి దిగజారడం కన్న పాఠకుణ్ని తన భావ భాషాశ్రేణికి చేదుకోవడం ఉత్తమ కవిత్వం అవుతుంది. అట్లాచెయ్యకపోతే కవిత్వ లక్ష్యమే ఉపహతమవుతుంది. పాఠకుణ్ణి రెచ్చకొట్టె రచన అది కావ్యం కానివ్వండి, నాటకము, నవల, కధానిక ఏదైనా కావచ్చు ప్రచార సాధనము మాత్రమే అవుతుంది. కవిత్వము పని నల్లమందు వలె పని చేసి పాఠకుణ్ణి నిద్రౌచ్చడం కాదని పూర్వులు కూడా చెప్పారు. అతనిని కర్తవ్యాభిముఖుణ్ణి చెయ్యడం కావ్య లక్షణాల్లో ఒకటని వారు కూడా తలపొసారు. చూడండి విద్యానాధుడు ప్రతాపరుద్ర యశోభూషణంలో ఎంటున్నాడో!