పుట:Sahityabashagate022780mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'సారమతింగవీంద్రులు ప్రసన్న కధా కవితార్ధయుక్తిలో; నారసిమేలు నానితరులక్షర రమ్యత నాదరింప నానారుచిరార్ధసూక్తినిధి నన్నయభట్టు తెనుంగనన్ మహా భారత సంహితా రచన బందురుడయ్యె జగద్దితంబుగన్ '- నన్నయ 'కవున భారతా మృతము కర్ణ పుటంబుల నారగ్రోలి యాంధ్రావళి మూదముం బొరల్యు నట్లుగ సాత్యవతేయ సంస్కృతి శ్రీ విభవాస్పదంబయిన చిత్తంతోడ మహాకవిత్వ దీక్షానిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదంగృతుల్"-- తిక్కనసోమయాజి.

                     "ఇమ్మను జేశ్వరాధముల కిచ్చిపురంబులు వాహనంబులున్!
                     సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కిశరీరము నాసి కాలుచే!
                     మమ్మెటపోటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చిచెప్పెనీ
                     బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్!-

     ముగ్గురు మహాకవులు తాము రజాహితంకోసం సాహిత్యసృష్టి చేస్తూన్నట్లు చెప్పుకొని యున్నారు.  లోకహితాన్నే కోరి వారు బారత, భావవతాలువ్రాసినా సాహిత్యంయొక్క ఉదాత్త లక్షణాలనుగాని తమఆత్మదర్మాన్ని కాని వీడినట్లుకాన్పించదు.  నన్నయ భట్టారకుడు తన కవిత్వలక్షనాలను సంగ్రహంగా చెప్పాడు. తిక్కనసోమయాజి వ్యాసమునీంద్రుని సంస్మరిస్తూ 'మహాకవిత్వ దీక్షావిధినంది ' రచన సాగిస్తానని ప్రతిజ్ఞచేశాడు.  తుచ్చమైన ఐహిక సంపదలకోసం గాక శ్రీహరి సమ్మతికోసము, లోకహితం కోసము వ్రాస్తున్నానని ఉద్ఘాటించాడు.  ఇక్కడ ఒకప్రశ్న కలుగుతూంది.  పూర్వ మహాకవులు వారు చెప్పుకొన్నట్లుగా నిజంగా ప్రజాహితంకోరియేరచనలు చేసినట్టయితే వారి గ్రందాలు ఇప్పటిప్రజలకు యధాతధంగా అర్ధంకావడంలేదేమిటి? ఇది నేతిబీరకాయ ప్రతిజ్ఞకదా అనవచ్చును.  ఈ సందేహాన్ని మనము ఇట్లా పరిహరించాలి.  వారు గ్రంధాలు వ్రాసి కొన్ని శబ్దాలు చెల్లిపోయాయి.  భాషా స్వరూపం విస్తారంగామారింది.  ఎవరు కవిత్వం చెప్పినా సంకాలికుల్నివారికి తెలిసినంతవరకూ శాశ్వత సత్యాలను దృష్టిలోపెట్టుకొని చెప్పుతారు కాని అనంతమైన భావికాలాన్ని అంతటినీ ఉద్దేశించి వ్రాయలేదు.  అదిసాధ్యమును కాదు. అందుచేత ప్రాచీన కవిత్వంలో కొంతబాగం మనకు అస్పష్టంగానే ఉండి పోవచ్చును.
       పోనివ్వండి. ఈ పూర్ఫకవుల కవిత్వం సమకాలంవారికైనా అందరికీ అర్ధమయి ఉంటుందా, ఎవరో కొందరు పండితులకు మాత్రమే అర్ధమయి ఉంటుంది.