పుట:Sahityabashagate022780mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవి లక్ష్యము - సాహిత్య భాష

కూర్చోవాలంటే కవికి రెండుమార్గాలు కనబడుతున్నాయి. స్వభాషాసిద్ధమైన పద జాలాన్ని నేర్పరితనంతో వాడుకుంటూ క్రొత్త కలయికలు చేస్తూ, అర్ధవంతమైన పదబంధాలు సృష్టిస్తూ రచన సాగించాలి. రెండవది పైనచెప్పిన ఆదానమార్గంగాతన భాషలో చేరిన పదజాలాన్ని సంచితంగా వాడుకోవచ్చును. ఏదేశపు సాహిత బాషైనా ఇట్లాగే సంపన్నమవుతుంది.

        కవి లక్ష్ల్యము - సాహిత్య భాష
   ఒక్కొక్క కవి పెట్టుకొన్న లక్ష్యాన్నిబట్టి అతడు నిర్మించిన సాహిత్యభాష భిన్నంగా ఉంటూంటుంది.  కవి సమాజంలో మూడు రకాలు గుర్తించవచ్చు (1) కవికేంద్రవాదులు (2) ప్రజాకేంద్రవాదులు (3) ఉభయవదులు.  కవి తన సంతోషంకోసమై తన ఆత్మాభివ్యక్తికై తన ఇచ్చవచ్చిన మేరకు రచన చేయదగునని విశ్వసించువారిని కవికేంద్రవాదు లంటారు. ఇదివరలో మనము చెపుకొన్న రాజస కవి ఈతెగకు చెందినవాడు  తెలుగులో ప్రబంధకవులను, ప్రబంధమార్గమునకు బాటలువైచిన పూర్వకవులను, ఈ వర్గంలో చేర్చవచ్చును. ప్రజాకేంద్రవాదులు ఆధునిక కవు లంటారు.  ప్రజాభ్యుదయంకోసము.  ప్రజానందంకోసం కవిత్వం వ్రాయాలంటారు వీరు.  ఈ కవి అత్మాభివ్యక్తికి అంత ప్రాధాన్యం ఇవ్వక సమకాలికసమాజానికి ఏది రుచిస్తుంది, ఏది అందుబాటులో ఉంటుంది అని చూసుకుంటూ రచన చెయ్యాలంటారు.  ఇతడు తనకు తాను అన్యాయం ఛెసుకుంటూ సమాజానికి అన్యాయం చేసినవాడవుతున్నాడు.  ఎట్టాగంటే, ఉత్తమకవి క్రాంతదర్శి అంటున్నాము.  అనగా జగత్పత్యాన్ని ఇతరులు తెలుసుకొనేదానికన్న నిశితంగా అతడు తెలుసుకొనగలుగుతాడన్నమాట.  మనము ఆస్తికులమైతే భగవదంశ ఇతర మానవులందు కన్న కవియందు అధికముగా భాసిస్తుందని చెప్పతాము.  ఇట్టి విశిష్టవ్యక్తి సత్యదర్శనమునందు, సత్యప్రవచనమునందు అధికశక్తి అధిక తాత్పత్యము కలిగిఉంటాడు.  లోకానికి కర్తవ్యా కర్తవ్యముల విషయంలో సందేశం ఇవ్వడానికి అర్హత మహాకవికి ఉంటుందని అందరూ ఒప్పుకుంటున్నాదు.   Poets are the legislators of mankind -  కవులు లోకానికి ధర్మనిర్ణేతలు అని ఒక ఆంగ్లకవి అన్నాడట.  కవులు ఋషులవంటి వారని మన పూర్వులు కూడా ప్రవచించారు.  'ననృషి: కురుతే కావ్యం ' అని వారిసూక్తి. ఋషికానివాడు కావ్య నిర్మాణం చెయ్యలేడు.  ఇది వ్యాసవాల్మీక్యాదుల విషయమే కావచ్చును.  ఒక హోమరు కావచ్చును; వర్జిల్ కావచ్చును; మిల్టను కావచ్చును.  పధ్యమల్లగల ప్రతివానికి మనము ఇటువంటి అభ్యర్హితస్థానం అరోపించలేము.  అయి