పుట:Sahityabashagate022780mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీనినిబట్టి తన ప్రౌఢ కవిత్వాన్ని మెచ్చలేనివారిని శ్రీనాధుడు సొమరిపోతులు. వసవల్పు బాలకులు అని ఈసడించినవాడని విమర్శించడం న్యాయమా? ఏసందర్భంలో మహాకవి ఈ యవమానం ప్రయోరించాడో సావధానంగా పరిశీలించాలి. అసలీభావం శ్రీహర్షనైషధంలోనే ఉంది. శ్రీనాధుడు అనువాదం మాత్రమే చేశాడు. అయినా శ్రీనాధుడు తక్కువతిన్నవాడేమి కాదు. ఆగ్రహంవస్తే ప్రత్యర్థులైన పండితుల్ని విదలించేవాడే. రాజమహేందవర పందితుల్ని గూర్చి బీమేశ్వరపురాణంలో అంటాడు.

                    "బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు
                      శాంతి నిపచ్చరంబు మచ్చరము ఘనము
                      కూప మండూకములవోలె కొంచెమెఱిగి
                      పండితమ్మన్యులైన విఅతండికులకు."

     అందుచేత ఆయా కవులు ఈషత్కోసావిష్టులై చెప్పిన మాటలను గాక వారు సావధాన చిత్తంతో ప్రకటించిన బానాన్నే వారి హృదయావిస్కరణానికి మూలంగా గ్రహించాలి.
    మొత్తంమీద ప్రాచీనులు సాహిత్య భాషకూ వ్యహారంలోని భాషకూ కొంత అంతరం ఉండాలని నమ్మినవారే. ఆ యంతరము ఎంత దూరమైనది. ఎంత గహనమైనది అనె విషయం లోనే అభిప్ర్రాయ భేదాలకు అవకాశం గలిగింది.  సాహిత్యభాషకూ జన వ్యహార భాషకూ మధ్య ఉండే వ్యవధానం ఉండీఉండనట్లు ఉండాలని తలపోశారు నన్నయ తిక్కనాది మహాకవులు. అది ఇంకా కొంచెం గభీరంగా ఉండాలని తల పోశారు నాచన సోమన శ్రీనాదదులు జానుతెనుగే కావ్యభాషగా ఉండాలంటారు పాల్కురీ సోమనాధాదులు.  ఆ యంతరం గహనంగా, పెద్ద అఖాతంగా కూడా ఉండవచ్చును అనుకొన్నారు ప్రబంధ కవులు.  ఈయవాంతరం బొత్తిగా ఉండకూడదంటారు ఆధునికులు.  వారు వరు భావించిన దానికి ఆచరణలో అనుష్ఠించిన  దానికీ వ్యత్యాసాలు కనబడుతూంటాయి.  ఎందుచేతనంటే ఒకలక్ష్యానిన్ని పెట్టుకోవడం వేరు. ఒక మహా కావ్యంలో అధ్యంతమూ దానిని అమలు పెట్టడం వేరు. ఏటికి అడ్డం పడిన గజీతగాడు ఒక్కటే ఈతపద్దతిని పాటించాలనే విషయం ఏమి ఉంది.  ఉన్నా కాని  అది ఆచరణ సాధ్యమా. ఒకప్పుడతడు భారీత ఈదుతాడు.  ఒకప్పుడు కుక్కవలె నిలువీత ఈదుతాడు.  ఒకప్పుడు తెడ్డీత ఈదుతాడు.  మరీ ఆయాసం వస్తే వెల్లకిల బది తోసుకు పోతాడు.  అవతలి ఒడ్డు చేరడమే పరమ లక్ష్యంకాని మిగిలిన చిన్న