పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76 సాహిత్య మీమాంస

సతీత్వ గౌరవము

పతియెడ సతికుండ దగిననుప్రేమ అలౌకిక మనుటకు సీతయే దృష్టాంతము. పతిభక్తికిని సతీత్వమునకును చూడాంత నిదర్శనమగు ప్రేమస్ఫీత సీత అపూర్వకవిసృష్టి అనకతీరదు - ఇట్టి సతీత్వము పాతివ్రత్యమును ఆర్యసాహిత్య మెక్కువగా కొనియాడబట్టి యీరెండు ధర్మములూ ఆర్య నారీజనమునకు మూలబలమని యెంచనగును. 'సతి' అను మాట వినగానే ఒడలు గరుపారును - పతినే మననము చేయుచూ ఆతనినే సేవించుచూ ధ్యానించుచూ తదితరము నెరుగనట్టి నారీమణి, 'సతి', యనబడును. సతీదేవి పతినింద చెవిని బడినతోడనే అగ్నిలో నురికింది - సావిత్రి పతిశరీరము నంటి యుండుటచేతనే కదా యము డామే నంటవెరచెను! సుమతి పతిరోగదళిత కళేబరమును తప్తకాంచన నిభముగా నొనర్చగల్గెను. సావిత్రి యముని చేతబడిన పతిప్రాణముల నార్జింపగల్గెను - వీరిట్లు చేయగల్గుటకు సతీత్వ పాతివ్రత్యములే ముఖ్యసాధనములు - సతీత్వమును గౌరవించినన్నాళ్ళు ఆర్యలలనామణులు అధికశక్తియుతలై విరాజిల్లుచుందురు. సతి అనుదానికి పతివ్రత అనునది పర్యాయపదము - సతి మనకు దేవీతుల్య, ఆమెకు పతి దేవతుల్యుడు, అట్టి భావముతోనే ఆమె అతని నర్చించుచుండును. ఇట్టి సతీగౌరవమును స్థాపించినవి ఆర్యశాస్త్రములు - ఆర్యావర్తము పుణ్యభూమీ, ఆర్యధామములు పవిత్రములూ అగుటకు సతులే ముఖ్యాధార