పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

73 దివ్యప్రేమ

తప్ప వేరెవ్వరును "భగవంతుడు మాకు ప్రాణవల్లభు"డని చెప్పుకొన జాలరు. సత్యభామ అట్లే అనుకొనుచుండెను కాని రాధామనోవల్లభుడగు శ్రీకృష్ణు డామెకు గర్వభంగ మొనర్చెను. ఆమెప్రేమను దృప్తభక్తి అనదగును. ఆత్మ సమర్పణమున పరిణతి చెందిన రాధాప్రేమభక్తి కిది సాటి కాదు. రుక్మిణిభక్తి దాంపత్యప్రేమ మాధురీసంఘటిత మవుటచేత దానికి యోగ్యపరిణతి ప్రాప్తించింది. ప్రేమ భక్త్యుల్లాసమున శ్రీకృష్ణలీలాతరంగిణులయందు అభిమాన విలాసములతో రాధ ఓలలాడుతూ ఉండడముచేత ఆమెకు శ్రీకృష్ణుని ప్రేమయే లోకము, ఆమె సర్వస్వ మదే. శ్రీకృష్ణుడే ఆమెధనము, ఆతడే ఆమె సుఖము, అతడే ఆమెచింత; అతని ప్రేమయే ఆమె కునికిపట్టు, అతని తోడునీడగా నుండి ఆమె యితరమును మరచెను; ఆమెకు శ్రీకృష్ణునితోడి విరహ మెక్కడిది? అతని ధ్యానమున సదా మగ్నయై ఎప్పుడూ ఆతనినే విలోకిస్తూ ఉండును. శ్రీకృష్ణునెడ క్షణమైనా విముఖత చెందక, తద్రూపమయ బృందావనమున తత్కధామృత రసపానము చేస్తూ ఆమె కాలము పుచ్చుచుండెను. రాధా కృష్ణులు ఎల్లప్పుడూ కదంబమూలమున విరాజిల్లుతూంటే రాధ శ్రీకృష్ణునుండి వేరుపడు టెట్లు?

సీత ప్రేమయందలి ఐకాంతికము

సీతా విరహ మింకొక మాదిరి; సుఖాలవాలమగు బృందావనమున అది జనింపలేదు - అశోక వనియం