పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71 దివ్య ప్రేమ

ణము లామె చేతుల యందలి పూరినిమేయుచుండ, మయూరము లామెవేయు తాళము ననుసరించి నృత్యము చేయు చుండెను; పావురములూ గువ్వలును ఆమెతో ప్రేమాలాపములు సల్పుచుండెను. క్రూరమృగములు సయితము హింసా ద్వేషముల నుజ్జగించి ఆమె నిర్మించిన ఉద్యానమున విచ్చల విడిగా విహరించుచుండెను. ఆప్రేమ కాననమున శాంతిసుమములు వెల్లివిరియుచుండెను. సీతప్రేమ అపారమని గోదావరి ధీరమందస్వనమున చాటుతూ అమృతరసధారల వెల్లివొడుచు చుండెను. జనస్థాన మంతా ఆమె యందలి ప్రేమచే పుష్పవృష్టి కురియగా ఆలతాంతరాసులతో వనదేవతలను ప్రియ దేవతయగు పతిని ఆమె పూజిస్తూండెను. ఇందుచే అయోధ్య యందు రాజసింహాసనమున నుండడము రామున కెక్కుడు సుఖదాయక మో, లేక పంచవటియందలి కుసుమోద్యానమున నుండుట ఎక్కుడు సుఖదాయకమో నిర్ణయించడము సులభము కాదు. ఆకుసుమ కాననమున సీత రామునకు స్వర్గసుఖము చేకూర్చిందని ఇదివరకే చెప్పి యుంటిమి కదా? పంచవటి సీత నిర్మించిన ప్రేమ రాజ్యము. ఆ దంపతుల నిస్తుల సుఖజీవనము చూచువారికి "ముందున్నది ముసుళ్ళ పండుగ" అని స్ఫురించక మానదు.

కవికులతిలకుడగు వాల్మీకి మహాముని అపూర్వమగు ఈప్రేమ చిత్రమును రచించెను. కణ్వాశ్రమమందలి శకుంతల పంచవటియందలి సీతయొక్క నకలువలె తోచును. మిల్టన్