పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడో ప్రకరణము

________

సాహిత్యమున దివ్యప్రేమ.

సీతాదేవి ప్రేమ -

సాహిత్యమున ప్రేమమాహాత్మ్యము గాంచవలె నన్న సీతాదేవిచరితమును పరికించవలయును. ఆమె రాజర్షి యగు జనకుని ప్రశాంతవంశమున పుట్టి, లాలనపాలన శిక్షల నొంది, ప్రేమమూర్తి యైన శ్రీరాముని చెట్టబట్టింది, కావున అద్వితీయప్రేమమూర్తి అయింది. శ్రీరాముడు సింహాసనాధీశుడై నప్పుడు తాను మహారాణి నౌదుననే ఔత్సుక్యముతోనున్న సీత, అతనికి వనవాస మబ్బినతోడనే వెంటబోవుటకు సిద్ధ పడెను; అందు కాత డొప్పుకొనలేదు, ఆమె మాత్రము ముందంజ వేసినది. ఘోరాటవుల గ్రుమ్మరుట అమిత భయావహమనీ కష్టదాయక మనీ రాముడెంత బోధించినా ఆమె నిరుత్సాహపడక, నిర్భయముగా పతి వెన్నంటెను,