పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65 రక్తపాతము

పార్సీనాటక సంఘములు - వారి రంగస్థలస్థితి;

పార్సీనాటకసంఘముల మూలమున మన దేశమున వియోగాంతనాటకముల కెక్కువప్రచారము కల్గింది. వా రా నాటకముల ప్రదర్శింప వేనవేలుప్రజ లతికుతూహలమున చూచి సంతసిస్తారు. నాటకములు చదివేటప్పటికన్న రంగస్థలముల యందు చూచేటప్పుడు కురుచులు జనుల మనములందు చక్కగా కుదురుపడతవి. మనవారిప్పటి నూతన సారస్వతో జ్జీవనమున రచించు నాటకములయందు, నవలల యందు, అపరాధపరిశోధక కథలయందునూ విషప్రయోగములు, హత్యలు యధేచ్ఛముగా గుప్పుతూన్నారు. వియోగాంత నాటకము లంతగా మనలో ప్రబలలేదు. అది కొంత మేలు. వాటిప్రభావవీచిక లంతటా వీచుచుండుటచే గ్రంథములయందు ఆత్మహత్యలు నవిరళముగా పరిఢవిల్లుచున్నవి, వాటియెడ వెగటు తగ్గుచున్నది. ధర్మభీరుత, పాప భీతియు పాడుపడుతూన్నవి. పురుషులయందేకాక స్త్రీలయందు కూడా కురుచులువ్యాపిస్తూన్నవి. *[1] నాటకదర్శన కౌతూహలము నానాటికిహెచ్చి, విదేశీయాదర్శము లాబాలగోపాలము ఆమోదనీయము లవుటవల్ల ఇతరభాషలయందును, సాహిత్యముల యందును ప్రబలియున్న కురుచులు మనభాషలయందు

  1. * ఇప్పు డిప్పుడు సినిమాలు ఊరి కొకటిచొప్పున వ్యాపిస్తూన్నవి. వాటిలోనూ హత్యలు పరిపాటే, ఆదర్శములు అవనతములు, రుచుల నాగరకములునై ప్రేక్షకుల మనస్సులందు విషబీజములను నాటుతూన్నవి.