పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59 రక్తపాతము

గముచేత కరుణ జనించును; హత్యావళిచేతనో, బీభత్స ముత్పన్నమై కరుణను కమర్చును. డెస్‌డెమోనా తలపునకు రాగానే జాలిపుట్టును గాని, ఆమెహత్య తలంచినతోడనే వెగటు పుట్టి కరుణరసమునకు భంగము కలుగును.

హోరెస (Horace)ను గ్రీకు విమర్శకుడు "రంగస్థల మందు ప్రకాశముగా హత్యాదికముల ప్రదర్శించుట తప్పు? గాని అప్రకాశముగా కన్పఱచిన దోషముండదని" వచించెను. ఇది "గుడ్డిలోమెల్ల" అని యెంచరాదు. హత్య అనుమాట వినగానే మనసులో దడబుట్టును. గొప్పగొప్ప పట్టణములలో జరిగెడు హత్యల నందరము కళ్ళతో చూచినామా? వినుకలిమాత్రమున నవి కండ్లకు గట్టినట్లు తోచవా? కల్పనా మాత్రముననే ఆదృశ్యములు ప్రత్యక్షములుకావా? బాలహత్య, స్త్రీహత్య, స్వామిహత్య, పితృహత్య, మాతృహత్య అన్న మాటలు వినగానే ఒళ్ళు జలదరించి ఆహత్యా కాండము మనయెదుట జరుగునట్లుండును. కావున హత్య అన్న మాటయే నాటకములనుండి బహిష్కరించుట మేలు; అదిప్రత్యక్షమైనను పరోక్షమైనను రసభంగము కాకతీరదు. అందున్నూ అనాధల, అమాయికుల, సద్గుణశీలుర హత్యల మాట చెప్పవలయునా? గ్రీకు సాహిత్య మీముప్పును సృజింప ఇతర ఐరోపీయ సాహిత్యములు దానికి దోహద మొనర్చినవి; ఆ విషవృక్షఫలములన్నియూ కురుచి భరితములు, జన సామాన్యమందలి సురుచు లందు చేరజాలవు; ఆఫలములు