పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58 సాహిత్య మీమాంస

లోభము గహర్య్‌పాపమని చిత్రించుట కే కదా అవి యవతరించెను. అట్లు పాపగహుర్య్‌లగు వారెంద రుందురు? అట్టి రాజ్యలోభము నరికట్ట జాలువా రెవరు? అట్టి అసాధారణ వ్యక్తుల చరిత మందరికళ్ళయెదుట కట్టుటవల్ల ప్రయోజన మేమి? నాటక మితిహాసమా? ఇతిహాససౌభాగ్యము ఇతిహాసమున నుండనీ, నాటకములలో దానిని దూర్చడ మెందుకు?

హత్యలేకుండానే వియోగాంతముల రచించిన పట్టుల షేక్స్‌పియరు తప్పక ప్రశంసాహున్‌డు. అతని నాటకములలో కొన్ని వియోగాంతములయ్యు సంయోగాంతములనే వాడబడుచున్నవి. కాని వాటిని వియోగాంతములుగా గణించుటయే శ్రేయము. ఇమోజిన్ సీతాదమయంతులవలె ఘోరకష్టములపాలు కాలేదు, అందుచే వారితో సమగౌరవమునకు పాత్రము కాజాలదు - సింబెలీన్ నాటకము వియోగాంతమై ఇమోజిన్ లియోనిటసులకు సమాగమము ప్రాప్తించెనా, ఆమెను జూచి యందరు క్షోభచెంది యుందురు. సీతా రాములకు సమాగమము లేనందుచేతనే వారి వనవాసమూ వియోగమూ అధిక కరుణాస్ఫూర్తములయ్యెను. సీత పుట్టిల్లు చేరినచో ఆమెయెడ ఇప్పటి జాలిపుట్టునా? ఆమె వనవాసము కావ్యమందలి కరుణను కడ్డముట్ట జేసింది. ఆరసము స్థాయీ భావము నొందుటచేతనే ఉత్తర రామచరిత్రకు విశిష్ట గౌరవము ప్రాప్తించింది. ఛాయాంకమున నిది ప్రకటితమగును. వియో