పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లనుట సర్వజనసమాదరణీయము. మన సనాతనధర్మమందు విధింపబడిన ఆదర్శములు, ఆచార వ్యవహారములున్నూ పాశ్చాత్యాదర్శాచారవ్యవహారములతో పోల్చి చర్చించడము ప్రస్తుతమున అత్యావశ్యకము-ఏలయన పాశ్చాత్యాచారముల తోటి సంసర్గము మన కనుదినమూ హెచ్చూతూంది. అవి కొత్త వౌటచేత షేక్స్‌పియరు చెప్పినట్లు -

...............................................New customs

Though they be never so ridiculous,

Nay, let' em be unmanly, yet are followed,

అనుసరింపబడు నూత్నాచార మపహ

సనకరము నపౌరుషంబును సైన.

ఉభయ జాతుల బాగోగు లీగ్రంథమున కొంతవరకూ వివరింపబడినవి కావున చదువరులదృష్టి మన సనాతనధర్మ వాఙ్మయముల దెస కాకర్షింపబడి మన ఆత్మగౌరవము, ఉన్న తాదర్శములు, అధ్యవసాయము, దేశభక్తి భాషాభిమానమూ ఏ మాత్రమైనా వృద్ధిపొంది, యోగ్య విమర్శజ్ఞానము ఆంధ్రుల కలవడితే మా యత్నము సఫలమవుతుంది.

పద్యములను తర్జుమా చేసేటప్పుడు కొంద రాంధ్ర కవుల అనువాదము లిం దుల్లేఖించినాము; ఈ విషయమున బ్రహ్మశ్రీ ఆదిభట్ట నారాయణదాసుగారి "నవరస తరంగిణి" మా కమితోపకారి యైనది. షేక్స్‌పియరు పద్యముల ననువ