పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57 రక్తపాతము

నొనర్చుట వలన రసము పరిపక్వము కాబోదు. అట్టినాటక కవిత హానికరము రసభంగజనకమునై దోషదూషితమగును. కసాయి కర్మ కవిత కాదు. (Butchery is not poetry)

షేక్స్‌పియరు నాటకములందు కవిత లేదనరాదు. హత్యచేయకున్న కరుణరసస్ఫూర్తి కానేరదా? అట్లు చేయ నేరని కవులు విభావాది అంగములచే రసపరిపాకము రచింప నేరనివా రన్నమాట. వా రారసము జోలికి పోకుండుటయే శ్రేయము. హత్య నైసర్గికముగా జుగుప్సాజనకము. దానికి కేదీ జోడింపనక్కరలేదు. హత్యయెడ వెగటుపుట్టించడానికి నాట్యసాహిత్యమున దాని నెలకొల్ప యత్నించినచో ఫలము వికటించును. ఒక్కొక్కతరి చాలా హత్యలు జరుగును. యుద్ధములమాట యటుంచి రాజ్యలోభమున ఔరంగజేబొనర్చిన హత్యల స్మరింపుడు. ఒథెలో వంటివా రెందరున్నారు? కవియే ఆతని పెద్దజేసి అస్వాభావికవ్యక్తిగ నొనరించెను. మానవుడు అందు నభిజాతుడగు వీరుడు అంతటి వెంగలివిత్తగునా? ఇది సంశయాస్పదమే. జాన్‌నాటకమున హ్యూబర్టు మండుచున్న లోహశలాకను తెచ్చి ఆర్తరు కన్నుల కాల్చుట కుద్యమించిన తోడనే జుగుప్సు పుట్టును. కన్ను లట్లు పోకుండుట మేలయ్యె. ఆనిష్ఠురకర్మ నోరువలేక పాప మా రాజపుత్రుడు కారాగారకుడ్యమునుండి దుమికి కాలధర్మము నొందెను. అట్టి ఆత్మహత్య మానవహృదయముల వేధింపదా? ఆబీభత్స దృశ్యములకు ఫలమేమి? రాజ్య