పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56 సాహిత్య మీమాంస

పరిహాసాస్పదుల మగుచున్నాము. భీషణమగు మానవ హత్య, విషప్రయోగము, కారావరోధము, త్వగ్విదారణము మొదలగు దృశ్యముల జూచి సంతసించుట క్రూరప్రకృతి ధర్మము. వాటిని ఆంగ్లప్రేక్షకుల ఎదుట కన్పరచుటచే కొందరు పరాసువిమర్శకులు మన వినోదము లిట్టివని యెంచి మనల రక్తప్రియులనీ క్రూరకర్మానిష్టులనీ గేలిసేయుదురు. వియోగాంతనాటకము ముగియుసరికి రంగస్థలమున పీనుగుల పెంట, నేపథ్యమున కత్తులు, కఠారులు, బాకులు, పిస్తోలులు, విష పాత్రలు ఇతర ప్రాణాపహరణోపకరణములును జూచుట రోతగా నుండును."

రంగస్థలమున రక్తపాతము హేయమనియు, అసభ్యమనియూ ఆంగ్లవిమర్శకులే వాక్రుచ్చుచున్నారు, కావున హత్యాకాండము ఆనందజనకము కాదనే వారి మతము. నాటకము నవరసాశ్రయము; వియోగాంతనాటకము కరుణ భయానకముల నెక్కువగా నుపయోగించును. భయానక రసపరిణామము హత్యయు రక్తపాతము కానక్కరలేదు; రసస్ఫూర్తి కలుగుటకు రస మానందదాయకము కావద్దా? ఆనంద జనకము కానిచో రసము స్ఫూర్తిచెందడ మెట్లు? తళతళ లాడుచున్న కత్తిని తనువున గ్రుచ్చుటచూచి తనియు వారుందురా? దానివలన జుగుప్స ఆవహిల్లునా? లేక సంతస ముదయించునా? హత్యాపరంపర అమర్చినచో భయానక రసమునకు భంగము వాటిల్లును. నాటకమును కసాయిఖానాగా