పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53 రక్తపాతము

ముల నలరించును. అట్టి దొండపండును కాకి ముక్కున గట్టి ఒథెలో చరితమునకు మహత్వము తేవలెనని పత్నీఘాత యను కుచక్రమును కవి పన్నెను. పాఠకులు ప్రేక్షకులును ఆ కుచక్రమున దగిలి హత్యావ్యాపారమున మగ్నులవుదురు. నిష్కారణముగా నిర్దయుడగు మోరకుడామెను బలవన్మరణముపాలు జేసెను. ఈవ్యాపారమెంత బీభత్సమో యోచించండి. కవి ఆమెను సృజించిన దట్లు చంపించుట కేనా? ఇట్టి హత్యాకాండమును చూడంజూడ కన్నులు నీరుగ్రమ్మవా? కాయమెల్ల క్రోధవశమున కంపింపదా? డెస్‌డెమోనా వధా నంతరము ఎమీలియా వధింపబడునప్పుడు ఆకత్తి మనగుండెలోపొడిచి నట్లగును. ఎంత భయానకము! ఏమి బీభత్సము!

వియోగాంతమా, కసాయికొట్టమా?

షేక్స్‌పియర్ రచించిన మేక్‌బెత్ నాటకమున ఇంతకన్న బీభత్సమెక్కువ. అది హత్యతో ప్రారంభించి హత్యతో బెరిగి హత్యతోడనే ముగియును. మొదట డంకన్, నడుమ బాంకో, తుదిని మేక్‌బెత్ హతులగుదురు. నాటకమంతా కసాయిఖానా! అందును రాణీమేక్‌బెత్‌వచ్చి "నాచేతి రక్తము వీడునదికాద"ని చెప్పినప్పటినుండి రక్తవృష్టి అతిశయించును. ఇట్టియెడ అక్కడక్కడ అనుతాప తుషారము ప్రారంభించునుకాని కాలుచున్న యింటిని కన్నీటితో నార్పతరమా? ఆవీచికలు హత్యాకాండ జనితపృధుల రక్తప్రవాహమున నెచటికో కొట్టుకొని పోవును. బిందెడు విషమున నొకపాల చుక్క!