పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/7

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పీఠిక

ఆంధ్రవాఙ్మయమున సాహిత్యవిమర్శనపద్ధతుల వివరించు గ్రంథములు చాలా తక్కువ. విమర్శకులకు కొదవ లేదు, గానీ ఏ నియమముల ననుసరించి గ్రంథముల మంచి చెడ్డలు నిర్ణయించవలెనో ఉదాహరణములతో చర్చించే గ్రంథములు తగినన్ని లేవు; ప్రాచ్యప్రతీచ్యాదర్శముల తార తమ్యము కన్పర్చున వసలే లే వనవచ్చును.

అట్టి గ్రంథమును రచించవలె నను కోరిక మా మదిలో రూఢమైన పిమ్మట బొంబాయి హిందీగ్రంథరత్నాకరసంపాదకు లీ గ్రంథమును ప్రచురించిరి. తోడనే దీనిని తెనుగుచేయ సంకల్పించి వారి అనుమతి వేడగా అచిరకాలమున వారనుజ్ఞ నిచ్చినందుకు వారికి చిరకృతజ్ఞులము.

ఈ గ్రంథమునకు మూలము శ్రీయుత పూర్ణచంద్రవసు గారిచే "సాహిత్యచింత" అను పేర వంగభాషలో వ్రాయబడెను. దానిని కొంత కుదించి మరికొంత పెంచి శ్రీమాన్ పండిత రామదహినమిశ్ర, కావ్యతీర్థులు హిందీబాష ననువదించిరి. మేము దీనిని కొంచెము పెంచి తెనుగు జేసితిమి.

శ్రీయుత వసుగారి అభిప్రాయము లందరికీ నచ్చక పోవచ్చును, కాని వారు చర్చించిన విషయములు ముఖ్యము