పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46 సాహిత్య మీమాంస

(Goths) నియూ బర్బరజాతులవారు నివసించుచుండిరి. వా రమిత నిర్దయాస్వాంతులు. అట్టివారిరక్తము ఆధునిక ఐరోపీయజాతులరక్తనాడులలో నిప్పటికీ ప్రవహిస్తూంది. కౄర కర్మములయెడ ప్రసన్నతవహించుట ఇప్పటికిని కొన్ని ఐరోపీయజాతులవారికి సహజము. స్పార్టనుల నిర్దయాచరణములు రోమీయుల కోలీషియమ్ పోట్లాటలు (Gladiatorial fights) నిందకు ప్రమాణములు.

మధ్యకాలీ (Middle Ages) నేతిహాసములుకూడా భయంకరరక్తపాతముచే నిండియున్నవి. మతయుద్ధములు*[1] (Crusades) మతాంతహన్‌త్యలు †[2] (Inquisition) ను విన్న ఒళ్ళు గగురుపొడుచును. యూదుల (Jews) మూల ముట్టుగా నాశనముచేయు ప్రవృత్తి, భూతవైద్యులకు సోదె గాండ్రకు సత్యాన్వేషణపరులగు శాస్తజ్ఞులకు ఐరోపీయులు విధించిన మరణశిక్షలూ ఇంకొకజాతివారియందు కాన రావు. ఇంతయేల? ఐర్లాండువృత్తాంతము, ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, స్కాటులును కావించిన అన్యోన్యరక్తప్రవాహము

  1. * Crusades అనునవి క్రైస్తవులకు మహమ్మదీయులకు జరిగిన మతయుద్ధములు క్రైస్తవుల పుణ్యభూమియగు జెరూసలెమ్ మహమ్మదీయులవశమునుండి తప్పించిటయే వీటి యుద్దేశము యూరపుఖండ మందలి ప్రతిదేశస్తులు (నిందు పోరాడి మడియు చుండిరి.)
  2. † (Inquisition) అనునది క్రైస్తవలయందలి శాఖలలో నన్యోన్యము కలుగుచుండిన హత్యలు. ఇవి అతిభయంకరములు, హృదయ దారకములు.