పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రక్తపాతము

43

ప్రకారమును స్త్రీహత్య, అయోగ్యకర్మగా భావింపబడుచున్నది. అట్టియెడ అమాయిక నిరపరాధిని యగు అబలహత్య అత్యాహితముకాదా! అందుమూలమున చూపఱహృదయముల కానందము చేకూరదు సరేకదా, మాలిన్యముకూడా సంక్రమించును. అట్టి దృశ్యముల నాటకములందు కూర్చుట పాపహేతువు, కావుననే ఆర్యనాటకకవులు వాటిని బహిష్కరించిరి. [1]

హిందువుల ఆదర్శము.

స్త్రీహత్యను రంగస్థలమున ప్రయోగించుట అనర్థ దాయకము హిందూధర్మాపేతమని వక్కా ణించితిమి. వేలామువెర్రిచే నాటక కవులు దీని నుపయోగించి రా, రంగస్థలము నర

  1. ఈయభిప్రాయము బొత్తిగా తోసివేయదగినది కాకున్నా కొంతవఱకు అతిశయోక్తి అనక తీఱదు. ఇప్పటి నాటకములలో నిట్టిదృశ్యములు తరుచుగా గుప్పుచుండుటచేత ప్రేక్షకుల గుండెలు దిట్టబడుచున్నవి. కాలగతి మారుచుండుటచే ఇట్టి దృశ్యములు అనుభవ సిద్ధములగుచున్నవి. అసూయావేశమున కదా ఒథెలో నిదర్శన మేదియులేక నిరపరాధినియగు కాంతపై నిందమోపి నిధన మొనర్చెను.ఇట్లే యెన్నో హత్యలు ఇప్పుడూ జరుగుచున్నవి. ఈర్ష్య మానవులకన్ను గప్పి కార్యాకార్య విచక్షణను క్రమక్రమముగా తగ్గించును, కనుక ప్రేక్షకులకు ఒథెలోయెడ కొంత సానుభూతి జనింపవచ్చును. సాత్త్వికచిత్తులకును అస్థిరభావులకు, నిర్భోధులగు బాలకులకు ఇట్టి దృశ్యములు గర్భనిర్భేదకము లనుటకు సందియములేదు. నిరపరాధులు బాముల బడుచుండ జూచి యోర్వలేక తత్కారకుల శిక్షింప ప్రేక్షకులు కొన్నివేళల క్రోధావేశులై రంగస్థలమున కురుకుటయు, ఒకరిద్దరు ఉన్మాదు లగుటకూడా తటస్థించును.

7